నెల రోజులుగా పి. ఏ నగర్ లో ఎల్లమ్మ గుడి ముందు రోడ్ల పై పారుతున్న మురుగు నీరు..
పట్టించుకోని అధికారులు,ప్రజాప్రతినిధులు
ఇబ్బంది పడుతున్న బస్తి వాసులు
చందానగర్ డివిజన్ పి. ఏ నగర్ లో బస్తి వాసుల పిర్యాదు మేరకు బస్తి లో పర్యటించిన మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.
మాజీ కార్పొరేటర్ మాట్లాడుతూ పి. ఏ నగర్ లో ఎల్లమ్మ గుడి ముందు గత నెల రోజులుగా డ్రైనేజీ పొంగిపొర్లి రోడ్లపై పరుతున్న విషయం స్థానిక బస్తి ప్రజలు పిర్యాదు చేసిన కూడా పట్టించుకోని ప్రజాప్రతినిధులు,అధికారులు.అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడుతూ గుడికి పోయే భక్తులు ఇబ్బంది పడుతున్నారు అని సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరటం జరిగినది.సమస్యను వెంటనే పరిష్కరిస్తాం అని అధికారులు చెప్పటం జరిగినది.