శేరిలింగంపల్లి,శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ లో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది.ఉద్యమకారుడు పార్టీ ఫౌండర్ మెంబర్ మల్లికార్జున్ శర్మ చేతుల మీదుగా పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన అనoతరం ఈ సందర్బంగా బండి రమేష్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ నుంచి శాసన సభ్యులుగా పోటీ చేస్తున్నాననీ బండి రమేష్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధిష్టానం అండ దండలు ఉన్నాయని కచ్చితంగా పార్టీ నుంచి బీఫామ్ తెచ్చుకొని శేర్లింగంపల్లి బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి నా గెలుపు అధిష్టానం కు కానుక శేరిలింగంపల్లి ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్,కేటీఆర్ కు బహుమతిగా ఇస్తానని అన్నారు గతంలో 2009 సంవత్సరం శేరిలింగంపల్లి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి 30 వేల పై చిలుకు ఓటు బ్యాంక్ సంపాదించానని నిత్యం ప్రజలతో మమేకమై ఉంటు ప్రజలకి అందుబాటులో అన్నీ వేళల నా సహయ సహకారాలు అందజేస్తున్నానని ప్రజల సమస్యలు తీరుస్తూ నిత్యం ప్రజలతో ఉండే మనిషిని అని బండి రమేష్ అన్నారు.అలాగే వచ్చే ఎన్నికలు ఈ నాలుగు ఐదు నెలల్లో ఉన్నందున మియాపూర్ లో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రజలందరినీ కలుపుకుని వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్, మిర్యాల రాఘవరావు, బిజేపి నాయకులూ మువ్వ సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు రాఘవేందర్ రెడ్డి, అశోక గౌడ్, కమండ్ల శ్రీనివాస్ రెడ్డి, శేఖర్ గౌడ్, ఇతర సీనియర్ నాయకులు అభిమానులూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న అడిషనల్ డీసీపీ జయరాం
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న ఏసీపి జయరాం శేర్లింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ లో భారీ వినాయకుడిని మాదాపూర్ అడిషనల్ డీసీపీ జయరాం దర్శించుకున్నారు .అనంతరం ఆయన...
Read more