కీలక సందేశాన్ని ఇస్తున్న యేసు జీవితం..
జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి..
నగరంలో క్రిస్మస్ కోలాహలం మొదలైంది.. క్రెస్తవ సోదరులంతా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేసుకొంటున్నారు.. ఈ క్రమంలో మాదాపూర్ లోని ఆవాస హోటల్లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యఅతిథిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ.. ఏసు ప్రభువు జీవనం అందరికీ ఆదర్శప్రాయమని, ఆయన బోధనల ద్వారా మానవాళిని సన్మార్గం వైపు నడిపించేలా మార్గ నిర్దేశం చేసినట్లు తెలిపారు. నిస్సహాయులపై కరుణ, సాటివారిపై ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని వెల్లడించారు.
ఎన్జీవో డాక్టర్ నిర్మల నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా జీవోదయ హోమ్ కు చెందిన 50 మంది అనాధ పిల్లలకు అవసా హోటల్లో విందు ఏర్పాటు చేసారు.. మరోవైపు లోకంలో పెద్ద పేరు, ప్రజలచే గౌరవాభిమానాలు, జేబుల నిండా డబ్బులు వంటివి సంతోషాన్ని ఇవ్వవన్న విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు అన్నారు.
మనం చేసే మంచి పనులు.. శాంతి, సంతోషాన్ని, మానసిక ప్రశాంతతను ఇస్తుందని యేసు జీవితాన్ని చూస్తే అర్థం అవుతుందని పేర్కొన్నారు.. ప్రపంచానికి శాంతిని, ప్రేమను అందించిన మహనీయుడు యేసు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. మీ ఎదుగుదలలో ఆయన ఇచ్చిన బోధనలు తోడ్పాటును అందిస్తాయని తెలిపారు..