కోవిడ్ నిబందనలను అనుసరిస్తూ తెలంగాణాలో స్కూళ్ళు ప్రారంభిచాలని ప్రబుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 1నుండి విద్యాలయాలు పున:ప్రారంబించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలియజేశారు.
స్కూల్స్, కళాశాలల సిబ్బంది ఖచ్చితంగా కోవిడ్ మార్గదర్శకాలుపాటించాలని సూచించారు. స్టూడెంట్స్, పేరెంట్స్, కూడా సహకరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. విద్యాలయాల్లో వాక్సీన్ ప్రక్రియను కూడా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈనెల 8 వ తేదీ నుండి సంక్రాంతి సెలవులు ప్రకటించగా, మళ్ళీ నాలుగో దశ కోవిడ్ కారణంగా, వైద్యశాఖ సలహా మేరకు సెలవులు పొడగించారు.ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో మళ్ళీ విద్యాలయాలు తెర్చుకోవడంతో తెలంగాణాలో కూడా అదే నిర్ణయం తీసుకున్నారు.