గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ యోజన’ పథకాన్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బీహార్‌లోని ఖగారియా జిల్లాలో ఈ పథకాన్ని ప్రధాని ప్రారంభించారు. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన లక్షలాది మంది వలస కార్మికుల కోసం కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. రూ.50వేల కోట్లతో వలస కార్మికులకు సొంతూళ్లలోనే ఉపాధి కల్పించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 116 జిల్లాల్లోని వలస కార్మికులకు 125 రోజుల పాటు ఉపాధి కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ పాల్గొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న కూలీలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. లాక్‌డౌన్ కారణంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రత్యేక శ్రామిక్ రైళ్ల ద్వారా స్వస్థలాకు చేరవేశామని, ఇప్పుడు అక్కడే పనులు చేసుకునేందుకు గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ యోజనను తీసుకొస్తున్నామని అన్నారు.