పెరిగిన ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేటు
ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేటును పెంచింది. ఏడాది నుంచి పదేళ్ల కాలపరిమితికి కోటీ రూపాయల కంటే తక్కువ చేసిన డిపాజిట్లపై వడ్డీని 5 నుంచి 10 బేసిస్ పాయింట్ల మధ్య పెంచింది. అంటే 0.05 శాతం నుంచి 0.1 శాతమన్నామాట. పెరిగిన వడ్డీ రేట్లు నేటి నుంచి అమలు కానున్నాయి. రెండేళ్ల కంటే తక్కువ కాలపరిమితికి చేసిన డిపాజిట్లపై నిన్నటి వరకు 6.65 శాతం ఉండగా, నేటి నుంచి ఆది 6.75 శాతానికి పెరిగింది. రెండేళ్ల నుంచి మూడేళ్ల కంటే తక్కువకు చేసే డిపాజిట్లపై వడ్డీ 6.65 శాతం నుంచి 6.75 శాతానికి పెరిగింది. ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు చేసే వాటిపై 6.75 శాతం నుంచి 6.85 శాతానికి పెరిగింది. ఐదేళ్ల నుంచి పదేళ్ల కాలపరిమితికి ఇప్పటి వరకు 7.25 శాతం ఉండగా, ఇప్పుడది 7.35 శాతానికి పెరిగింది. ఈ వడ్డీ రేట్లు సామాన్య ప్రజలకు మాత్రమే. ఎస్‌బీఐ ఉద్యోగులకు, ఎస్‌బీఐ పింఛన్‌దారులకు ప్రస్తుతం పేర్కొన్న దానికంటే వడ్డీ రేటు ఒకశాతం అధికంగా ఉంటుంది.