చిల్కనగర్: చిలుకనగర్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371వ జయంతి ఉత్సవ సభ ఘనంగా నిర్వహించారు. సర్దార్ పాపన్నని స్మరించుకుంటూ ఈ సభ నిర్వహించుకున్నారు.ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా బోడుప్పల్ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్ హాజరయ్యారు.ఈ కార్యక్రమం నూతనంగా ఎన్నికైన నూతన గౌడ్ సంఘం ఆధ్వర్యంలో జరిగింది.
ఈకార్యక్రమంలో అధ్యక్షులు మాచర్ల మొగిలి గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈకార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పటేల్ వెంకటేష్ గౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మొరిగాడి ఉపేందర్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి విజయ్,గౌడ్ మరియు గౌడ్ సభ్యులు హాజరయారు.