రంగారెడ్డి జిల్లాలోని మణికొండలో నూతన మూవీ ఆఫీసులో పూజా కార్యక్రమాన్ని సంయుక్త ఆర్ట్స్ పిక్చర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. సురేష్ రుద్రరాజు దర్శకత్వంలో సినిమా చెయ్యటానికి , నిర్మాత శ్రీమతి హేమమాలిని రాజు చమర్తి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కీర్తిశేషులు శ్రీ వెంకట రాజు ఆశీస్సులతో సంయుక్త ఆర్ట్స్ పిక్చర్స్ ద్వారా ఫార్మల్ పూజతో ఈ సినిమా లాంచ్ మొదలైనది. . శ్రీమతి హేమమాలిని రాజు చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుoడ్ర కుమారస్వామి ,బీజేపీ యువనేత నోబెల్ సురేష్ యాదవ్, నిర్మాత హేమ మాలిని రాజు,డైరెక్టర్ సురేష్ రాజు మరియు ఇతర రంగానికి చెందిన నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత హేమ మాలిని రాజు మాట్లాడుతూ లిమెటెడ్ బడ్జెట్ లో ఓటిపి పద్ధతిలో ఈ సినిమా నిర్మాణం చేస్తామని, అన్ని రకాల ప్రేక్షకులను అలరించే విధంగా, నిర్మాణ విలువలతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలియజేశారు.
..