సాయి చంద్ మృతి కలచివేస్తోంది: దుండ్ర కుమారస్వామి
తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వీ. సాయిచంద్ హఠాన్మరణం చెందడం కలచివేస్తోందని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అన్నారు. ఉదయం లేవగానే సోదరుడు సాయి చంద్ మరణవార్త వినడం దురదృష్టకరమని అన్నారు. 39 ఏళ్ల వయసులోనే సాయి చంద్ మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడని.. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
పీజీ వరకు చదువుకున్న ఉన్నత విద్యా వంతుడు సాయి చంద్ విద్యార్థి దశ నుంచి కళాకారుడు, గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన ఆట పాటలతో ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని రగిలించారని దుండ్ర కుమారస్వామి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే ఎన్నో కార్యక్రమాలలో ఆయన పాటలతో అలరించారని.. అలాంటిది ఇప్పుడు ఆయన లేరనే విషయాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. సాయి చంద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు దుండ్ర కుమారస్వామి తెలిపారు.
