*సామాజిక న్యాయ స్ఫూర్తి ప్రధాత ఎస్ జైపాల్ రెడ్డి*
*జైపాల్ రెడ్డి స్మారక సెమినార్లో డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు*
*జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ఆధ్వర్యంలో “డే లాంగ్ సెమినార్”*
*జైపాల్ రెడ్డి ఈ తరానికి, మరెన్నో తరాలకు ఆదర్శం, స్ఫూర్తి- జాతీయా బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి*(National BC Dal President Dundra Kumara Swamy)
పుట్టుకతో ఉన్నత వర్గానికి చెందినవాడైనా జీవితాంతం సమ సమాజాన్ని ఆకాంక్షించిన దార్శనికులలో రాజకీయ ప్రముఖుడు సూదిని జైపాల్ రెడ్డి అని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు.
మండల కమిషన్ నివేదికతో వి.పి.సింగ్ ప్రభుత్వం బీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 27% రిజర్వేషన్లను ప్రవేశపెట్టినపుడు, నాటి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా జైపాల్ రెడ్డి సేవలు చరిత్రలో సుస్థిరస్థానం సంపాదించుకున్నాయన్నారు.
సోమవారం నాడు జాతీయ బీసీదళ్ ఆధ్వర్యంలో కాచిగూడ లోని రాష్ట్ర కార్యాలయంలో “సామాజిక న్యాయం- ఎస్.జైపాల్ రెడ్డి” అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు పాల్గొని స్వర్గీయ ఎస్. జైపాల్ రెడ్డి చిత్రపటం వద్ద పుష్పాలు సమర్పించి, ఘనంగా అంజలి ఘటించారు.
జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు, దుండ్ర కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్లో వివిధ సంఘాల ప్రతినిధులు, నాయకులు, సామాజికవేత్తలు… ప్రొఫెసర్ బాగయ్య, డాక్టర్ వెంకటరమణ, యుగంధర్ గౌడ్, రేఖారాణి, డాక్టర్ సరోజనమ్మ, గాదె సమ్మయ్య, N. రాధిక, ప్రొఫెసర్. శ్రీనివాస్, ప్రొఫెసర్ జి. సతీష్, మహేందర్ బాబు, మురళి కృష్ణ, లక్ష్మణ్ యాదవ్, మహేష్ పెరిక, రఘుపతి ముదిరాజ్, శ్రీనివాస్ రజక తదితరులు పాల్గొనీ ప్రసంగించారు.
ఈ సెమినార్ లో డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు ప్రసంగిస్తూ… స్వర్గీయ జైపాల్ రెడ్డి కేంద్ర పెట్రోలియం మంత్రిగా ఉన్నప్పుడు పెట్రోల్ బంక్ లలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు.
ఈ సెమినార్ కు సభాధ్యక్షత వహించిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ప్రసంగిస్తూ ..దేశంలోనే మెజార్టీ జనాభా కలిగిన బీసీలు అన్ని రంగాలలో ఎదిగినప్పుడే దేశం వేగంగా ప్రగతి సాధిస్తుందని జైపాల్ రెడ్డి తన వంతు కర్తవ్యంగా జీవితాంతం కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు. నమ్ముకున్న ప్రజలకు, నమ్మిన సిద్ధాంతాల కోసం ఎంతటికైనా ఎవరితోనైనా పోరాటం చేయగల మహోన్నత వ్యక్తిత్వం జైపాల్ రెడ్డి అని కొనియాడారు.
