వెంటనే ఉక్రెయిన్ నుండి వచ్చేయమని భారత ఎంబసీ విద్యార్థులకు సూచించింది. ఉక్రెయిన్ – రష్యా విభేదాలు, ఉద్రిక్తతలు పెరుగుతున్న వేల ఈ సూచనను జారీ చేసింది. మీరు ఆన్లైన్ తరగతుల గురించి ఎదురు చూడవద్దని, అత్యవసరంగా ఇండియా వచ్చేయమని చెప్పింది.
ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటి వరకు భారత అడ్వైజరీ జారీ చేసిన ఆదేశాల్లో ఇది మూడవది. ఇంతకుముందే అత్యవసరమైతే తప్ప అక్కడ ఉండొద్దని హెచ్చరించింది.
మెడికల్ యూనివర్సిటీ లో ఆన్లైన్ తరగతుల నిర్వహణ గురించి తెలుసుకోవడానికి భారత రాయబార కార్యాలయానికి ఎక్కువమంది ఫోన్లు చేస్తున్నారు. దానికి సంబంధించి అధికారులతో చర్చలు జరుపుతున్నారు. కానీ ఎంబసీ అధికారులు మాత్రం ఆన్లైన్ తరగతుల విషయంలో యూనివర్సిటీ కన్ఫర్మేషన్ గురించి మీరు ఆలోచించవద్దు. వెంటనే ఇండియా వెళ్ళిపోండి. అని సూచించింది.