‘రిస్క్’.. బ్లాక్ బస్టర్ అవ్వడం మాత్రం పక్కా: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
తెలుగులో పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ దర్శకుడిగా మారి కొత్త వారితో తీస్తున్న పాన్ ఇండియా సినిమా ‘రిస్క్’. ఈ సినిమా సాంగ్ లాంఛ్ కు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి
బీసీ కమిషన్ చైర్మన్ వకులభరణ కృష్ణమోహన్, ప్రముఖ ప్రొడ్యూసర్ ఎమ్మెస్ రాజు, ప్రముఖ ప్రొడ్యూసర్ మైత్రి మూవీస్ యలమంచిలి రవిశంకర్, జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి, హీరో ఆదిత్య హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు మాట్లాడుతూ రిస్క్ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఒకప్పుడు మ్యూజిక్ తో యువతను ఓ ఊపు ఊపిన ఘంటాడి కృష్ణ ఇప్పుడు దర్శకత్వం కూడా చేస్తూ ఉండడం ఎంతో ఆనందంగా ఉందని దుండ్ర కుమారస్వామి అన్నారు. తాను రాసుకున్న కథ మీద ఎంతో నమ్మకం ఉండడంతో ఒక నిర్మాతగా కూడా ఆయనే మారారన్నారు. ఈ సినిమా ఇప్పటి యూత్ కు తెగ నచ్చేస్తుందనడంలో సందేహం లేదు. సినిమా బ్యానర్ పేరు జీకే మిరాకిల్స్.. ఈ సినిమా కూడా టాలీవుడ్ లో ఓ అద్భుతం చేయాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. యూత్ కు నచ్చిందంటే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం. ఈ సినిమా కూడా అలాగే బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది. ఈ సినిమాకు పని చేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ ఉన్నానన్నారు దుండ్ర కుమారస్వామి.
బీసీ కమిషన్ చైర్మన్ వకుళభరణ కృష్ణ మోహన్ రావు మాట్లాడుతూ ఘంటాడి కృష్ణకు సినిమా అంటే ఎంతో ప్రేమ. ఒకప్పుడు మ్యూజిక్ తో తెలుగు రాష్ట్రాలను ఎంతగానో అలరించాడు.. ఆ విషయం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. యూత్ ఫుల్ సినిమాలకు సంగీతం అందించడంలో దిట్ట అని ఇప్పటికీ చెప్పుకొంటూ ఉంటారు. అలాంటిది తను దర్శకుడిగా మారి.. ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తూ ఉండడం ఎంతో ఆనందంగా ఉంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాను తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. చిన్న సినిమాలతో ఎన్నో వండర్స్ చేయొచ్చు అనే విషయాన్ని ఒకప్పుడే గుర్తించిన వ్యక్తి ఘంటాడి కృష్ణ.. ఇప్పుడు తానే సొంతంగా సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమానే బ్లాక్ బస్టర్ గా మారుతుందనడంలో సందేహం అయితే లేదు. తప్పకుండా బ్లాక్ బస్టర్ ను అందుకుంటుంది. ఈ కార్యక్రమంలో గంటాడి కృష్ణ, హీరో సందీప్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ప్రముఖ ప్రొడ్యూసర్ ఎమ్మెస్ రాజు మైత్రి మూవీస్ యలమంచిలి రవిశంకర్ ,ఆదిత్య పాల్గొన్నారు