*పౌరుడా ఓటు హక్కు వజ్రాయుధం
*అవినీతిరహిత పాలనకు ఇది ఒక పరమ ఔషధం
*మి ఓటు మీ భవిష్యత్తు ?
*మీ ఓటు సమాజ శ్రేయస్సుకు
దోహదపడాలి.?
*ఓటు హక్కును
వినియోగించుకోవడం సువర్ణావకాశం లాంటిది.
ఓటు అనే అస్స్తం అవినీతిరహిత పాలన కు ఇది ఒక పరమ ఔషధం లాంటిది. కాబట్టి పౌరులందరూ ఈ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని మనవి చేస్తున్నారు బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కుమార స్వామి. దేశ భవిష్యత్తును మార్చగలిగే శక్తి కేవలం ఓటు హక్కు ద్వారానే సాధ్యమవుతుంది. ఓటు హక్కును వినియోగించుకోవడం పౌరులందరూ యొక్క ప్రాధమిక బాధ్యత. ముఖ్యంగా యువతను బీసీ కార్యకర్తలను మనమందరము ప్రోత్సహించాలని శ్రీ కుమారస్వామి గారు పేర్కొన్నారు. ప్రతి ఒక్క డివిజన్లో, సరైన వ్యక్తిని ఎంచుకుని వారికి ఓటు వేయడం ద్వారా మనం ఎంతో అభివృద్ధిని సాధించగలుగుతాము. అందరి సమస్యలను పరిష్కరించడానికి ఒకే ఒక్క మార్గం.ఈఎన్నికల్లో తమకు నచ్చిన అవినీతి రహిత పాలన అందించే సమర్ధవంతమైన నాయకుడిని ఎన్నుకునే హక్కు ఈ ఓటు ద్వారానే సాధ్యపడుతుంది, మంచి సమాజం, మంచి రాష్ట్రం, మంచి దేశం కావాలంటే మంచివారినే ఎన్నుకోవడానికి ఓటే ఆయుధమన్నారు.ఈ కార్పొరేట్ ఎలక్షన్స్ కాబట్టి సరైన వ్యక్తి ఎన్నుకోవడానికి ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవడం తప్పనిసరిగా పాటించాలి అని తెలియచేశాడు.