ఒక జాతీయ పార్టీ కి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి, రెడ్ల సంఘం అధ్యక్షులుగా మాట్లాడుతున్నారు అని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి ఎద్దేవా చేశారు. బహుజనుల ఆత్మగౌరవం దెబ్బ తినేలా చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం లోకి వెళ్తే కొడంగల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ప్రజల సమస్యలు రైతుల సమస్యల గురించి మాట్లాడాలి దానిని ప్రక్కన పెట్టి రెడ్ల రాజ్యాధికారం ,రెడ్లకు అధికారం ఇవ్వాలని రెడ్ల కులాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలను బహుజనుల మనోభావాలు దెబ్బ తినే విధంగా ఉన్నాయని తెలిపారు. రేవంత్ రెడ్డి కి అంతగా కులం మీద మమకారం ఉంటే రాజకీయాలను వదిలి రెడ్ల సంఘాలల్లో పని చేయాలని సూచించారు.బహుజనులు అంటే బానిసలుగా జెండాలు మోసే వారుగానే ఉండాలా అని ప్రశ్నించారు. అధికారం రావాలన్నా, కోల్పోవాలి అన్న రెడ్లకే సాధ్యం అని చెప్పడం ఎంత కుల అహంకారం అని అర్థం చేసుకోవాలి అని తెలిపారు.ఓవైపు బహుజన రాజ్యాధికారం రావాలని అనేక సంఘాలు పోరాడుతూ ఉంటే కుల పిచ్చి తో రేవంత్ రెడ్డి మాత్రమే , ఒక పార్టీ లో వుంటు రెడ్డి కులానికి అధికారం రావాలని మాట్లాడడం రెడ్డి కుల పిచ్చి ఎంతగా ఉందో ఒకసారి బహుజనులు అర్థం చేసుకోవాల్సిన సందర్భం ఉన్నది. తెలంగాణలో 4% ఉన్న రెడ్డి లు 39మంది ఎమ్మెల్యేలు అని 52% ఉన్న బీసీలు23 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని , ఇప్పటికైనా బహుజనులు మేలుకొని రాజ్యాధికారం వైపు ఆలోచించాలని కోరారు.
వకుళాభరణం దారెటు?
వకుళాభరణం దారెటు డాక్టర్ వకుళాభరణం రాజకీయ భవిష్యత్తుపై చర్చోపచర్చలు డాక్టర్ వకుళాభరణం దారి బిఆర్ఎస్ లో కొనసాగుతారా?, కాంగ్రెస్ పార్టీలో చేరతారా?, బిజెపి వైపు వెళతారా? డాక్టర్...
Read more