• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Business

రుణ రహిత కంపెనీగా అవతరించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌)

TP NewsbyTP News
20/06/2020
inBusiness, Companies, Featured
0
RIL

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) రుణ రహిత కంపెనీగా అవతరించిందని కంపెనీ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. 2021 మార్చి 31 నాటికి రిలయన్స్‌ను రుణ రహిత కంపెనీగా మార్చాలన్న లక్ష్యాన్ని 9 నెలల ముందుగానే సాధించగలిగామని అన్నారు. రికార్డు స్థాయిలో, కేవలం రెండు నెలల్లో రూ.1.69 లక్షల కోట్ల నిధులు సమీకరించడం ద్వారా రిలయన్స్‌ ఈ టార్గెట్‌ను చేరుకుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో దాదాపు 25 శాతం వాటా విక్రయం ద్వారా రూ.1.15 లక్షల కోట్లు, భారత్‌లో అతిపెద్ద రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.53,124 కోట్లు సేకరించిందీ కంపెనీ.

‘‘గడిచిన కొన్ని వారాల్లో అంతర్జాతీయ ఆర్థిక ఇన్వెసర్లు జియోతో భాగస్వామ్యం ఏర్పరుచుకునేందుకు ఆసాధారణ ఆసక్తి కనబర్చాయి. ప్రస్తుత నిధుల సేకరణ ప్రక్రియ ఇక్కడితో పూర్తయిన సందర్భంగా కంపెనీలో పెట్టుబడి పెట్టిన అంతర్జాతీయ ఆర్థిక దిగ్గజాలకు ధన్యవాదాలు తెలుపుతున్నా. జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి వారిని స్వాగతిస్తున్నా. అంతేకాదు, రికార్డులు సృష్టించిన రిలయన్స్‌ రైట్స్‌ ఇష్యూలో పాల్గొన్న రిటైల్‌, సంస్థాగత ఇన్వెస్టర్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నా’’ అని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ముకేశ్‌ అంబానీ పేర్కొన్నారు. గత ఏడాది ఇంధన విక్రయ వ్యాపారంలో 49 శాతం వాటాను బ్రిటన్‌కు చెందిన బీపీ పీఎల్‌సీకి విక్రయించడం ద్వారా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ.7,000 కోట్లు సమీకరించింది. ఈ మొత్తాన్నీ కలుపుకుంటే, కంపెనీ నిధుల సేకరణ మొత్తం విలువ రూ.1.75 లక్షల కోట్లవుతుంది. ఈ మార్చి చివరినాటికి ఆర్‌ఐఎల్‌ నికర రుణ భారం రూ.1,61,035 కోట్లుగా నమోదైంది. 

ప్రపంచ కుబేరుల్లో 9వ స్థానానికి ముకేశ్‌ 

ఆర్‌ఐఎల్‌ షేరు సరికొత్త రికార్డు మైలురాళ్లను అధిరోహిస్తుండటంతో కంపెనీ అధిపతి ముకేశ్‌ అంబానీ సంపద ఈ మధ్య కాలంలో గణనీయంగా పెరిగింది. తొలిసారిగా ఆయన వ్యక్తిగత సంపద 6,000 కోట్ల డాలర్ల స్థాయిని దాటింది. ఫోర్బ్స్‌ రియల్‌ టైమ్‌ బిలియనీర్స్‌ లిస్ట్‌ ప్రకారం.. శుక్రవారం నాటికి ముకేశ్‌ ఆస్తి 6,460 కోట్ల డాలర్లకు చేరుకుంది. దాంతో ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో 9వ స్థానంలో నిలిచారు. బ్లూంబర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌లో ముకేశ్‌ 11వ స్థానానికి ఎగబాకారు. 

ఆర్‌ఐఎల్‌ @ రూ.11 లక్షల కోట్లు  ..ఈ స్థాయికి చేరిన తొలి భారతీయ కంపెనీ 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తాజా మరో రికార్డును సొంతం చేసుకుంది. జియో లో పెట్టుబడుల వరదతో స్టాక్‌ మార్కెట్లో ఆర్‌ఐఎల్‌ షేరు దూసుకెళ్లింది. శుక్రవారం బీఎ్‌సఈ ట్రేడింగ్‌ ముగిసేసరికి షేరు ధర 6.23 శాతం ఎగబాకి రూ.1,759.50 వద్ద స్థిరపడింది. దాంతో కంపెనీ మార్కెట్‌ విలువ ఒక్కరోజే రూ.65,477.03 కోట్లు పెరిగి రూ.11,15,418.03 కోట్లకు చేరుకుంది. దేశ చరిత్రలో రూ.11 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ మైలురాయికి చేరిన తొలి కంపెనీ ఇదే కావటం విశేషం. ప్రపంచంలోని అత్యంత విలువైన ఇంధన కంపెనీల్లో రిలయన్స్‌ ఒకటి. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా టోటల్‌ ఎస్‌ఏ, రాయల్‌ డచ్‌ షెల్‌, బీపీ కంటే ముందు స్థానంలో ఉంది. కానీ, టాప్‌-3 ఆయిల్‌ కంపెనీలైన సౌదీ అరామ్కో, చెవ్రాన్‌, ఎక్సాన్‌ మొబిల్‌తో కంటే తక్కువే. 

59 సెషన్లలో షేరు ధర రెట్టింపు  

కేవలం 59 ట్రేడింగ్‌ సెషన్లలో రిలయన్స్‌ షేర్‌హోల్డర్ల పెట్టుబడుల విలువ రెట్టింపైంది. కరోనా సంక్షోభ ప్రభావంతో మార్చి 23న రూ.867.82కి పతనమైన రిలయన్స్‌ షేరు ధర.. నేలను తాకిన బంతి లా రివ్వున ఎగిసింది. తాజాగా రూ.1,750 ఎగువ స్థాయికి చేరుకుం ది. జియోలో పెట్టుబడులు, రైట్స్‌ ఇష్యూ ఇందుకు దోహదపడ్డాయి.

Tags: RIL
TP News

TP News

మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
News

మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

by TP News
27/01/2023
0

వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...

Read more
సేవా పతకo అందుకున్నా మహమ్మద్ గౌసూద్ధిన్

సేవా పతకo అందుకున్నా మహమ్మద్ గౌసూద్ధిన్

26/01/2023
అల్లాపూర్ లో నూతన సీసీ రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభం

అల్లాపూర్ లో నూతన సీసీ రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభం

24/01/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News