నిజాంపేట్ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్, స్వచ్ఛ నిజాంపేట్ లో బాగంగా కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్ డంపింగ్ యార్డ్ వద్ద రీసైక్లింగ్ యూనిట్ ని మేయర్ శ్రీమతి శ్రీ. నీలగోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కమిషనర్ గోపి IAS ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నేడు మనకు అత్యంత అవసరమైనది చెత్త సేకరణ మరియు పారిశుధ్యం. అందులో భాగంగా మన ప్రాంతంలో నూతనంగా ఈ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయటం శుభపరిణమన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చిట్ల దివాకర్ గారు,ఇంద్రజిత్ రెడ్డి , వాణిగారు,శ్రీరాములు, సుజాత, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి,తెరాస నాయకులు జగన్, మరియు సంబంధిత అధికారులు రెక్లైసింగ్ యూనిట్ నిర్వాహకులు సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.