రంగారెడ్డి జిల్లాల శేర్లింగంపల్లి మండలానికి చెందిన పలు ప్రాంతాలలో నల్లగండ్ల హుడా ప్రెసిడెంట్ మంత్రిప్రగడ సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు .కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సూచించిన విధంగా కరోణ మహమ్మరి కట్టడి కోసం స్వీయ నియంత్రణ పాటించి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని ఆయన కోరారు.
గత కొన్ని రోజులుగా పలు ప్రాంతాలలో గచ్చిబౌలి, చందానగర్ మరియు మియాపూర్ పరిధిలో దాదాపు 500 మందికి నిత్యావసర వస్తువులను పారిశుధ్య కార్మికులకు, నిరుపేదలకు అందజేశారు. లాక్డౌన్ మొదటి రోజు నుండి పారిశుద్ధ్య కార్మికులకు మరియు వరుస కూలీలకు ఆహారం భోజనాలు అందజేయడం జరుగుతున్నది.
ఈ సందర్భంగా తొలి పలుకు పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ డా.కేశవ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో అందరూ బాగుండాలని వారి యోగక్షేమాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా శ్లాఘనీయమైన సేవలందిస్తున్నాయి. ప్రజలు ఇళ్ల నుండి బయటికి రాకుండా అత్యవసర సమయాల్లోనే అవకాశం వినియోగించుకోవాలని పోలీసులకు, శానిటరీ సిబ్బందికి, రెవెన్యూ శాఖలకు ప్రతి ఒక్కరు సహకరించలని ఆయన విజ్ఞప్తి చేశారు.