‘ఒకే దేశం ఒకే కార్డు’ నినాదం కింద రేషన్ సరుకులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా తీసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. దేశంలో ఎక్కడైనా రేషన్ కార్డు చెల్లుబాటు అయ్యేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో లబ్ధిదారులు తెలంగాణ, ఏపీలో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చని పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు ఈ విధానాన్ని విస్తరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. నేషనల్ పార్టుబిలిటీ సిస్టమ్ కింద ప్రజలు ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. అదేవిధంగా యూనిట్ల వారీగా కూడా సరుకులు విడుదల చేసుకునే వెసులుబాటు ఉందని వెల్లడిస్తున్నారు. కొన్ని ఏపీలో మరికొన్ని సరుకులు తెలంగాణలో కూడా విడిపించుకోవచ్చని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ విధానంపై విస్తృత ప్రచారం చేయనున్నట్టు వెల్లడించారు
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు….
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు…. సెవెన్ సీస్ గేమ్ డెవలప్మెంట్ కంపెనీ అధినేత మారుతి శంకర్ కుమారుడు పంచ కట్టు...
Read more