రాంనగర్ : భారతదేశం, తెలంగాణ రాష్టం అంతటా కరోనా ఉదృతి వల్ల ప్రజలు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో… దేశ ప్రజలందరి శ్రేయస్సు కోరి 18 ఏళ్ళు పైబడిన వారందరకీ ఉచితంగా వ్యాకిన్స్ ఇస్తామని, ప్రధాని మోదీ తీసుకున్న గొప్ప నిర్ణయానికి, ముషీరాబాద్ నియోజకవర్గం, రాంనగర్ డివిజన్ బీజేపీ జనరల్ సెక్రెటరీ గడ్డం సతీష్ గారు హర్షం వ్యక్తం చేశారు..
దాదాపు 13 సంవత్సరాలుగా, బీజేపీ మూషిరాబాద్ మాజీ ఎమ్మెల్యే & ఓబీసీ మోర్చా డా.లక్ష్మణ్ గారి పిలుపు మేరకు, స్థానిక కార్పొరేటర్ రవిచారి ఆధ్వర్యంలో బిజేపి పార్టీ ఏ పిలుపిచ్చినా, చాలా యాక్టివ్ గా కార్యకర్తలతో కలిసి, రెట్టింపు ఉత్సాహంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, గడ్డం సతీష్ అందరి ప్రశంసలు పొందుతున్న సంగతి విదితమే.. ఈ నేపథ్యంలోనే తమ నియోజకవర్గ మరియు డివిజన్ లోని ప్రజలు ఎవ్వరు కూడా కరోనా బారిన పడకుండా ఉండాలనే సదుద్దేశంతో, వ్యాకిన్స్ పట్ల అందరికి గడ్డం సతీష్ అవగాహన కల్పిస్తున్నారు.
దేశాన్ని పట్టి పీడిస్తున్న కాంగ్రెస్ ని ఖతం చెయ్యాలంటే అది మోదీ నాయకత్వంలో బీజేపీతోనే సాధ్యమని, అలాగే దేశంలోని ప్రజలను పట్టి పీడిస్తున్న కరోనాని ఖతం చెయ్యాలంటే, మోదీ ఉచితంగా ఇస్తునటువంటి వ్యాకిన్స్ ఒక్కటే ఆయుధం అని ఆశాభావం వ్యక్తం చేశారు.. ప్రజలందరూ తప్పకుండా వ్యాకిన్స్ వేసుకుని కరోనా బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటూ, మోదీ నాయకత్వంలో దేశాన్ని కాపాడుకోవాలని ప్రజలందరికీ పిలుపునిచ్చారు..