రామంతాపూర్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, ఓల్డ్ రామంతపూర్ వార్డ్ ఆఫీస్ నుండి సెంటర్ వరకు ఉన్న డ్రైనేజీ సమస్య కాలనీవాసులు కార్పొరేటర్ బండారు శ్రీవాని వెంకట్రావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే కార్పొరేటర్ స్పందించి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేందర్, ఏ ఈ విజ్ఞేశ్వరీ తో కలిసి ఓల్డ్ రామంతపూర్ లో జరుగుతున్న ఫుల్ త్రో డ్రైనేజీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, ఇలాంటి సమస్యలు మళ్లీ రాకుండా పాత పైప్లైన్ తీయించి కొత్త పైప్ లైన్స్ వేయించాలని, అప్పటివరకు సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఎన్నో ఏళ్ళ నుండి ప్రజలు పడుతున్న ఈ సమస్యను కార్పొరేటర్ దృష్టి తీసుకురాగానే వెంటనే స్పందించినందుకు కాలనీవాసులు కార్పొరేటర్ కు ధన్యవాదాలు తెలిపారు. కాలనీవాసులు బిక్షపతి, నరసింహ, బాబు, లక్ష్మణ్, అనిల్, సత్యనారాయణ పాల్గొన్నారు. వారితో పాటు బిజెపి నాయకులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు బుర్ర రాజేశ్వర్, రేపు నరసింహ, డివిజన్ ప్రధాన కార్యదర్శులు సంకూరి కుమారస్వామి, ఉలుగొంద నారాయణ దాస్, మామిళ్ల సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు