రామంతాపూర్ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ నియోజకవర్గ రామంతాపూర్ లో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి , ప్రగతి నగర్, ఇందిరా నగర్, భవాని నగర్, శాంతినగర్, వివేక్ నగర్ పూర్తిగా జలమయమయ్యాయి. భారీగా పడుతున్న వర్షానికి కాలనీవాసులు రాత్రి రెండు గంటలకు కార్పొరేటర్ శ్రీమతి బండారు శ్రీవాణి వెంకట్రావుకి ఫోన్ చేయడంతో అదే సమయంలో బండారు వెంకట్ రావు వెళ్లి దగ్గర ఉండి భవాని నగర్, వివేక్ నగర్ లో సమస్య పరిష్కరించడం జరిగింది.
ఈరోజు జిహెచ్ఎంసి అధికారులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేందర్, డి ఈ నాగమణి, ఏఈ విగ్నేశ్వరీ లతో కలిసి కార్పొరేటర్ గారు ప్రగతి నగర్, భవాని నగర్, ఇందిరా నగర్, వివేక్ నగర్ కాలనీలలో పర్యటించారు. కాలనీవాసులు డ్రైనేజీ సమస్య, రైన్ వాటర్, సమస్య కార్పొరేటర్ గారి దృష్టికి తీసుకువచ్చారు. కార్పొరేటర్ స్పందిస్తూ ఇలాంటి సమస్య మళ్లీ రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
వారితో పాటు పలు కాలనీలలో స్థానికులు ప్రగతి నగర్ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి , గిరిబాబు, సతీష్, జలీల్ పాషా, వివేక్ నగర్ కాలనీ వాసులు, మరియు బిజెపి నాయకులు రామంతపూర్ డివిజన్ బిజెపి ప్రెసిడెంట్ బండారు వెంకట్రావు ,పడి గం నాగేష్, వేముల వెంకట్ రెడ్డి, వేముల తిరుపతయ్య పాల్గొన్నారు.