రామంతపూర్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా రామంతపూర్ డివిజన్ లో ఈరోజు కార్పొరేటర్ శ్రీమతి బండారు శ్రీవాణి వెంకట్రావు, రామంతపూర్ ప్రగతినగర్ నుండి రామంతపూర్ ఇందిరా నగర్ వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య తలెత్తడంతో, ప్రగతి నగర్ కాలనీ వాసులు ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చారు.
కార్పొరేటర్ వెంటనే స్పందించి అధికారులను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేందర్, డి ఈ నాగమణి, ఏ ఈ విఘ్నేశ్వరీ లను పిలిచి వారితో పర్యటించి ఇలాంటి సమస్యలు పునరావృతం కావద్దని సమస్య తక్షణమే క్లియర్ చేయాలని ఆదేశించడంతో అధికారులు స్పందించి వెంటనే ఎయిర్ టెక్ వాహనము పిలిపించి ప్రాబ్లం క్లియర్ చేయించడం జరిగినది. దానిలో భాగంగా కాలనీవాసులు కార్పొరేటర్ గారికి ధన్యవాదాలు తెలిపారు.