రామసేతు:
రాముడు లేడని, రాముడు వున్నట్లు చరిత్ర లేదని కొందరు వ్యాఖ్యానించిన దాఖలాలున్నాయి. ప్రస్తుతం దేశంలో రామ జన్మభూమి అయిన అయోధ్యలో రాముని ఆలయం నిర్మాణంపై చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో శ్రీలంకను, భారత్‌ను కలుపుతూ రాముడు రామసేతు నిర్మించాడనే వాదనకు అమెరికన్ సైన్స్ ఛానల్ ఊతమిచ్చింది.
హిందువులు నమ్మే రామాయణకాలం నాటి వారధి రామసేతు పచ్చినిజమని.. ఈ రామసేతు రామాయణ కాలంలో నిర్మించిందేనని అమెరికన్ సైన్స్ ఛానల్ శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ రామసేతును సున్నపు రాయిలతో తమిళనాడు ఆగ్నేయ ప్రాంతంలోని రామేశ్వరం నుంచి లంకలోని వాయవ్య ప్రాంతమైన మన్నార్ వరకు నిర్మించినట్లు శాస్త్రవేత్తలు ”వాట్ ఆన్ ఎర్త్- ఏన్సియంట్ ల్యాండ్ బ్రిడ్జ్” పేరిట ప్రసారం చేసిన కథనంలో పేర్కొన్నారు.
Are the ancient Hindu myths of a land bridge connecting India and Sri Lanka true? Scientific analysis suggests they are. #WhatonEarth pic.twitter.com/EKcoGzlEET
— Science Channel (@ScienceChannel) December 11, 2017
డిస్కవరీ కమ్యూనికేషన్స్ మాతృసంస్థగా ఉన్న ఈ సైన్స్ ఛానల్.. ఈ కథనానికి సంబంధించిన కథనాన్ని ట్విట్టర్లో షేర్ చేసింది. ఈ కథనంలో ఏడు వేల సంవత్సరాల క్రితం ఈ రాళ్లతో వారధి నిర్మితమైంది. ఈ రాళ్లు నీటిపై తేలుతున్నాయని, ఇసుక శక్తిని కూడా ఈ రాళ్లు కలిగివుండటం ద్వారా సముద్రంలో దృఢంగా నిలిచాయని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిపై 30 మైళ్ల పరిశోధన చేసినట్లు సైన్స్ ఛానల్ శాస్త్రవేత్తలు తెలిపారు.
అయితే 2007లో, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ మాట్లాడుతూ, రామ సేతు మానవనిర్మితమని నిరూపించటానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని, కానీ ప్రజల విశ్వాసాన్ని గౌరవించాలని వాదించారు. అయితే తాజాగా రామసేతుపై ఎన్ని పరిశోధనలు జరిగినా.. తాజాగా నాసా విడుదల చేసిన శాటిలైట్ ఫోటోల ద్వారా ధనుష్కోటి, శ్రీలంక మధ్య ఉన్న ప్రధాన భూభాగం మానవ నిర్మితంగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.