ఎన్డీయేకే జై కొట్టిన బీజేడీ, అన్నా డీఎంకే, టీఆర్‌ఎస్
విపక్షాల అభ్యర్థి హరిప్రసాద్‌కు 101 ఓట్లు
125 ఓట్లు సాధించిన అధికార పక్ష అభ్యర్థి హరివంశ్
గురువారం జరిగిన రాజ్యసభ వైస్ చైర్మన్ ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి, జనతాదళ్(యూ) ఎంపీ హరివంశ్ నారాయణ్‌సింగ్ 125 ఓట్లు తెచ్చుకుని విజయం సాధించారు. విపక్ష అభ్యర్థిగా బరిలో దిగిన కాంగ్రెస్ నాయకుడు బీకే హరిప్రసాద్‌కు 105 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇద్దరు ఎంపీలు సభకు వచ్చి నా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. పార్టీలకు అతీతంగా నేతలంతా హరివంశ్‌ను అభినందించారు. వెంకయ్య, మోదీ, గులాంనబీ ఆజాద్, జైట్లీ కలిసి హరివంశ్‌ను సభలో ఉపాధ్యక్షుడి కోసం ప్రత్యేకించిన స్థానం వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు.