తెలంగాణలో త్వర లో రైల్, మెట్రో కోచ్‌ల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు కానున్నది. రంగారెడ్డి-సంగారెడ్డి జిల్లాల సరిహద్దు కొడంగల్ ప్రాంతంలో సుమారు 100 ఎకరాల్లో హైదరాబాద్ సంస్థ మేధా సర్వో డ్రైవ్స్ ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తోంది. రూ.800 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న రైల్వే కోచ్‌ల తయారీ కేంద్రం వల్ల సుమారు రెండు వేల మందికి పైగా ప్రత్యక్షంగా ఉపాది లభిస్తుంది. 1984లో ఏర్పాటైన మేధా సర్వో డ్రైవ్స్ 1990లో రైల్వే విభాగంలోకి అడుగుపెట్టింది. రైల్వేలకు కావాల్సిన కోచ్‌లు, ప్రొపల్షన్ సిస్టమ్స్‌ను తయారు చేస్తోంది. భారతీయ రైల్వేకు సరఫరా చేయడంతో పాటు ఎగుమతి కూడా చేస్తోంది. రకరకాల లోకోమోటివ్ యూనిట్స్‌లో వీటిని వినియోగిస్తారు. ప్రొపల్షన్ ఎక్వి్‌పమెంట్‌కు సంబంధించి భారతీయ రైల్వే సంస్థకు మేధా సర్వో గ్రూప్ అతిపెద్ద సప్లయర్‌గా ఉంది. ఈ గ్రూప్‌లో మొత్తం 5 అనుబంధ సంస్థలున్నాయి. గతేడాది ఈ సంస్థ 1,000 కోట్ల రూపాయల సమీకృత టర్నోవర్ సాధించింది. కొడంగల్‌లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించిన ఎంఒయుపై శుక్రవారం నాడు మేధా సర్వో డ్రైవ్స్ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వంతో ఎంఒయు కుదుర్చుకున్నారు. పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు సమక్షంలో టిఎ్‌సఐఐసితో ఈ ఒప్పందంపై మేధా సర్వో సంతకాలు చేసింది.
పెరుగుతున్న డిమాండ్ కారణంగానే…
కేంద్రం హామీ ఏమైపోయిందో…