అయ్యప్ప నాధంతో మర్మోగిన కొండాపూర్
నేడు శేర్లింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ లోని మస్జీద్ బండ హనుమాన్ దేవాలయంలో అయ్యప్ప పడి పూజ నిర్వహించిన రాష్ట్ర యువమోర్చ కోశాధికారి మారబోయిన రఘునాథ్ యాదవ్, గురుస్వామి సతీష్ నాయర్ మరియు బి. లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఘనంగా హరిహర సుతుడు అయ్యప్ప పూజ కార్యక్రమం పూజా కార్యక్రమం జరిగింది.ఈ పూజకి వేలాది మంది స్వాముల మధ్య సర్వాంగా సుందరంగా స్వామిని అలంకరించి,అభిషేకించి 18 మెట్ల పడిపూజా నిర్వహించారు. అయ్యప్ప నామ స్మరణతో మండపం మర్మోగిపోయిందని,అయ్యప్ప స్వామి పూజకు విచ్చేసి జయప్రదం చేసిన భక్తులందరికి పేరుపేరున ధన్యవాదములు తెలియజేసారు.