హైదరాబాద్: ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంట, పువ్వాడ ఫౌండేషన్-ఖమ్మం కలిసి సంయుక్తంగా రెండున్నర కోట్ల రూపాయల విలువైన 250 ఆక్సీజన్ కాన్సన్‌ట్రేటర్లను రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ ఇవాళ ప్రగతి భవన్ లో సీఎం శ్రీ కేసీఆర్ కు అందించారు. వాటిని ఆవిష్కరించిన సీఎం మంత్రిని అభినందించారు.
ఈ ఆక్సీజన్ కాన్సన్‌ట్రేటర్లను ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదల కోసం వినియోగించనున్నట్లు మంత్రి పువ్వాడ తెలిపారు. అమెరికా నుండి ఈ కొత్త కాన్సన్‌ట్రేటర్లను దిగుమతి చేసే విషయంలో శ్రీ సునీల్ చావలి సహకరించినట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.