(తొలి పలుకు న్యూస్) మాదాపూర్ :భగీరథ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీరు అందిస్తామని,మునుముందు త్రాగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం దిశగా టిఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు శేరిలింగంపల్లి శాసనసభ్యులు,ప్రభుత్వ విప్ శ్రీ.అరేకపూడి గాంధీ ,మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్..
ఈరోజు మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ నూతనంగా మంజూరైన మంచినీటి పైప్ లైన్ పనులకు స్థానిక నాయకులు,హెచ్.ఎం.డబ్లు.ఎస్.ఎస్.బి అధికారులు డి.జి.ఎం శ్రీమన్నారాయణ ,మనేజర్ ప్రభకర్ తో కలిసి పనులను ప్రారంభించిన్న అనంతరం ప్రజలకు ఉచిత మంచినీటి పథకం కారపత్రాన్ని అందించారు శేరిలింగంపల్లి శాసనసభ్యులు,ప్రభుత్వ విప్ శ్రీ.అరేకపూడి గాంధీ ,మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్.
ఎమ్మెల్యే మాట్లాడుతూ..
టిఆర్ఎస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గృహ వినియోగదారులకు కోసం ప్రవేశపెట్టిన ప్రతి నెల 20వేల లీటర్ల ఉచిత నీటి పథకం ప్రతిఒక్కరు ఆధార్ అనుసంధానంతో పాటుగా మీటర్ బిగింపు నమోదు తేదీని 31.12.2021 వరకు పొదగించారని,ఈ అవకాశాన్ని ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ నాయకులు సయ్యద్ గౌస్,ఏకే బాలరాజు,శ్యామ్,లోకేష్,మాదాపూర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ సాంబశివరావు,ఖాసీం,సుభాష్ చంద్రబోస్ నగర్ టిఆర్ఎస్ బస్తి అధ్యక్షులు ముక్తర్,ఆదిత్య నగర్ టిఆర్ఎస్ బస్తి అధ్యక్షులు మునఫ్ ఖాన్,కృష్ణ కాలనీ టిఆర్ఎస్ బస్తి అధ్యక్షులు కృష్ణ యాదవ్,డివిజన్ మైనారిటీ అధ్యక్షులు ఎం.ఏ.రహీం,నాయకులు రెహ్మాన్,ఖాసీం,బాబుమియా,సలీం,సత్యనారాయణ,రాములు యాదవ,బుజంగం,అంకా రావు,అప్పల్ రాజు యాదవ్,భాస్కర్,హరి,యూత్ నాయకులు రవి యాదవ్,గోపి,మహమ్మద్,అఖిల్,భాస్కర్,అంజి,పవన్,మహిళలు మొగులమ్మ,శేషిరేఖ,శ్రీజ రెడ్డి,ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు..