Headline
230 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా, 33% అటవీ విస్తీర్ణం పెంచడమే గమ్యంగా ప్రారంభించిన ‘తెలంగాణకు హరిత హరం’ కార్యక్రమం లక్ష్యం దిశగా సాగుతుంది. పుడమితల్లి చల్లగా ఉంటేనే మానవ మనుగడ కొనసాగేది, విస్తృతంగా చెట్లు ఉంటేనే పర్యావరణం చక్కగా ఉండేది అనే ముందుచూపుతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ‘జంగిల్ బచావో, జంగిల్ బడావో’ అని పిలుపునిచ్చారు.గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి ఆశయాల సాధనలో, మునిసిపల్ శాఖామాత్యులు శ్రీ తారకరామారావు గారి బాటలో నడుస్తున్న పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు డా. బోర్లకుంట వెంకటేష్ నేత, హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ “కాలుష్యం తగ్గాలన్నా, సకాలంలో వానలు పడాలన్నా, భూమి మీద జీవం మనుగడ సాగించాలన్నా వృక్షసంపద ఎంతో అవసరం, ఆస్తులు సంపాదించి భావితరాలకు అందించే కన్నా, అద్భుతమైన చక్కటి పర్యావరణం అందించడమే అసలైన సంపద. పుడమి తల్లిని రక్షించే వారందరూ సహృదయం ఉన్న మానవులు, అలాంటి సహృదయతను చాటుకుని పచ్చని పర్యావరణం సాధిద్దాం. ప్రతి ఒక్కరం హరిత హారం లక్ష్యాలను అవగాహన చేసుకొని, కేసీఆర్ గారు పిలుపునిచ్చిన హరిత తెలంగాణ సాధనకు భాగస్తులవుదాం” అన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కుమారస్వామి గారు, ఫోరమ్ ఫర్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ డా. మహేంద్ర బాబు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ “తెలంగాణ అభివృద్ధికి నిరంతరం పరిశ్రమిస్తున్న బంగారుతెలంగాణ సారధి శ్రీ కేసీఆర్ మరియు శ్రీ కేటీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అగ్రస్థానంలో దూసుకుపోతోంది, హరితహారం విజయవంతం కావడానికి మా వంతు కృషి చేస్తాము” అన్నారు.