తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ,సెప్టెంబర్ 2 ,ప్రగతి నివేదన సభకు,ఒక రోజు ముందుగా సెప్టెంబర్ 1వ తేదీన చందానగర్, గాంధీ విగ్రహం నుండి ,ఉదయం తొమ్మిది గంటలకు , మూడు వేల మంది ప్రైవేటు ఉద్యోగులతో భారీ పాదయాత్రగా పోవాలని తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారియు కనీస వేతనాల చైర్మన్ సామ వెంకట్ రెడ్డి ఆలోచన చేసి తన కార్యవర్గ ముఖ్య అనుచరులతో చర్చించారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం నాలుగున్నరేళ్ల పాలనలో ప్రవేశపెట్టిన పథకాలు సంస్కరణలు, ప్రజా సంక్షేమకార్యక్రమాలను నివేదించనుండడంతో భారీగా వెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేశారు.
ఈ పాదయాత్ర లొ, ప్రతి ప్రైవేటు ఉద్యోగి భాగం పంచుకోవాలని పిలుపును ఇచ్చారు.