గర్భిణిని ముక్కలుగా నరికి సంచుల్లో కుక్కి బొటానికల్ గార్డెన్
సమీపంలో పడేసిన కేసులో పోలీసులకు హంతకుల ఆనవాళ్లు దొరికాయి. శవాన్ని బైక్‌పై తీసుకొచ్చి పడేసినట్టు సీసీ ఫుటేజీలు లభ్యమయ్యాయి.
గత నెల 30న వెలుగులోకి వచ్చిన ఘటనకు సంబంధించి పోలీసులు 10కి పైగా వీడియోల ను విశ్లేషించి హంతకుల్లో ఒక మహిళ, ఒక పురుషు డు ఉన్నట్టు గుర్తించారు. వారికి మరొకరు సహా యం చేసి ఉంటారని భావిస్తున్నారు. గర్భిణిని గత నెల 28న రాత్రి హత్యచేసి, మృతదేహం నుంచి రక్తం మొత్తం పోయిన తర్వాత నరికి సంచుల్లో పెట్టి బొటానికల్ గార్డెన్ వద్ద పడేసినట్టు అనుమానిస్తు న్నారు. తెల్లవారుజామున 3:27 గంటలకు యమహా బ్లూ కలర్ బైక్‌పై హెల్మెట్లు ధరించిన ఇద్దరు సంచులు తీసుకొని వెళ్తున్నట్టు, 3.36 గంటలకు బొటానికల్ గార్డెన్ జంక్షన్‌లో, 3.48 గంటలకు మజీద్‌బండా జంక్షన్ నుంచి బయటకు వెళ్తున్న దృశ్యాలను పోలీసులు సేకరించారు.
సీసీ ఫుటేజీని బట్టి మృతురాలు స్థానికురాలై ఉంటుందనే అనుమానం తో బైక్‌ను పట్టుకునేందుకు పోలీసులు ఆదివారం తెల్లవారుజామున గచ్చిబౌలి సమీపంలోని సిద్ధిక్‌నగర్, అంజయ్యనగర్‌లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానితుడి ఫొటో, బైక్ ఫొటోను అందరికీ చూపిస్తూ ఆరా తీశారు. అయినా ఎటువంటి క్లూ లభించలేదని తెలిసింది. ఈ ప్రాంతంలో ఎక్కువగా మహారాష్ట్ర, అస్సాంవాసులే ఉండటంతో హంతకులు, మృతురాలు ఈ రెండు రాష్ర్టాలకు చెందినవారై ఉంటారని భావిస్తున్నారు.
వాహనం నంబర్ ఆధారంగా..
బైక్ నంబర్‌ను సేకరించి దాని ఆధారంగా విచారణ జరుపుతున్నారు. వాహనం రిజిస్ట్రేషన్ వివరాల మేరకు యజమాని విచారించగా తాను ఆ బైక్‌ను 2007లో కొని ఆ తర్వాత అమ్మానని చెప్పాడు. ఆ తర్వాత బైక్ మరో ముగ్గురు నలుగురి చేతులు మారినట్టు తేలింది. చివరగా ఎవరు వాడారో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ బైక్‌పై 2014 నుంచి 2017 జూలై వరకు ఎనిమిది ట్రాఫిక్ ఉల్లంఘనల చాలాన్లు ఉన్నాయి. చివరిది మియాపూర్ పీఎస్ పరిధిలో హెల్మెట్ లేకపోవడంతో పోలీసులు పట్టుకొని నేరుగా చలాన్ విధించారు. శవాన్ని తరలించేటప్పుడు వాహనం రంగును, నంబర్‌ప్లేట్ మార్చే అవకాశాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. ఘటన వెలుగులోకి రావడంతో బైక్‌ను విచ్ఛి న్నం చేసే అవకాశాలు సైతం ఉన్నాయన్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టు అనుమానిస్తున్నారు. మరోవైపు ముగ్గురు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. రెండు రోజుల్లో కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నదని సీనియర్ అధికారి తెలిపారు.