మకుటం లేని మహారాజు ప్రజల కోసం- ఎర్రజెండా పోరాటాలు
అందరికీ ఆత్మీయుడు..
నీతి నిజాయితీకి నిలువెత్తు రూపం. జన నాయకుడు కామ్రెడ్ గుండా మల్లేష్ ,నాలుగు సార్లు శాసనసభ్యులుగా ఎన్నికైన అహం లేని వ్యక్తిత్వం యాభై రెండు సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో అవినీతికి అణువంతు అవకాశం ఇవ్వని,మచ్చలేని మహానుభావుడు .
నేటి ప్రజా నాయకుడు కామ్రేడ్ గుండా మల్లేష్ రాజకీయ ప్రస్థానం
మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో 1947 స॥ జన్మించినాడు . రైతు కుటుంబం నేపథ్యం ఉండటం వలన రైతు సమస్యలపైనా మరియు కార్మికుల సమస్యలపైన క్షేత్రస్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తి .
అప్పట్లో బడుగు బలహీన వర్గాలకు, దళితులకు,కార్మికులకు జరుగుతున్న అన్యాయాలను చూసి,వారి కోసం పోరాడటానికి, సిపిఐ పార్టీ కార్యక్రమాలకు ఆకర్షితుడై 1966 స॥ సిపిఐ సభ్యులుగా చేరారు .పార్టీ పిలుపు మేరకు సింగరేణి ఉద్యోగానికి రాజీనామా చేసి హోల్ టైమ్ వర్కర్ గా ప్రజల కొరకు జీవితాన్ని అంకితం చేయడం ఆయన వ్యక్తిత్వానికి ఒక ఉదాహరణ .
సిపిఐ పిలుపు మేరకు పేదలకు ప్రభుత్వ భూములు పంచాలని దేశవ్యాప్తంగా జరిగిన భూపోరాటంలో భాగంగా ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో కామ్రెడ్ గుండా మల్లేష్ నాయకత్వంలో పికెటింగ్ సత్యాగ్రహం చేసినందుకు ఇరవై రెండు రోజుల పాటు నలభై అయిదు మంది సిపిఐ నాయకులు కార్యకర్తలతో పాటు హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి ముషీరాబాద్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లొ ఉన్నాడు అంటే ఆయన కరడుగట్టిన కార్మికుల పక్షపాతి .
సాదాసీదా జీవితం ఎన్నో కష్టాలు, ఎర్రజెండా పార్టీకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పెద్దదిక్కుగా ఉంటూ ఎన్నో ఉద్యమాలు ఎన్నోసార్లు జైలు జీవితం, బడుగు బలహీన వర్గాలకు అండ ,శ్రమజీవుల పోరులోనూ ఉద్యమాల పొరులోనూ పుట్టిన పులిబిడ్డ గుండ మల్లేష్ ,ఆయన ఉద్యమాలను అయిన పోరాటాలను గుర్తించిన ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రజలు మూడు సార్లు రాష్ట్ర శాసనసభకు పంపించారు అంటే ఆయన గొప్పతనాన్ని గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఏర్పడుతుంది.
బెల్లంపల్లి, ఆసిఫాబాద్ పట్టణంలో అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది .
బెల్లంపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఆయన కృషి వల్లే సాధ్యమైంది.
ఒక యాక్సిడెంట్లో కాలు ఎముక విరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కామ్రేడ్ గుండా మల్లేష్ కి గిరిజన ఇళ్లను అక్రమంగా కూల్చివేసి ,పోలీస్ కాల్పుల్లో చెనని భీము అనే గిరిజనుడు మరణించాడు అని తెలిసిన వెంటనే,తన పరిస్థితి ఆలోచించకుండా విరిగిన కాలుతోనే హుటాహుటిన గిరిజనులకు న్యాయం కోసం పోరాటం చేసి రాష్ట్ర శాసనసభలో ప్రస్తావించి శాసనసభను స్తంభింప చేసి వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియో మంజూరు చేయించి గిరిజనుల పక్షపాతి అని పేరు తెచ్చుకున్నాడు.
వట్టివాగు ప్రాజెక్టు ,చెలిమెల ప్రాజెక్టు నిర్మాణం కొరకు శాసన సభ్యుడిగా అపార కృషి చేసి సాధించిన ఘనత ఆయనకే.
బెల్లంపల్లి పట్టణంలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు గుండా మల్లేష్ ప్రధాన కారకుడు.
తొలి దశ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి విభాగం నాయకునిగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో సిపిఐ శాసనసభ పక్ష నేతగా జైలుకెళ్లి తెలంగాణను సాధించుకున్న గొప్ప నాయకుడు కామ్రెడ్ గుండా మల్లేష్ .
ఒక్కసారి ఎమ్మెల్యే అయితే తరతరాలకు సరిపడే సంపాదించుకునే కాలంలో ఇప్పటికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాదాసీదా మనిషిగా బస్సుల్లో ప్రయాణం చేయడం,సిపిఐ సిద్ధాంతాలకు కట్టుబడటం, శ్రామికులకు కార్మికులకు, బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉండడం అది ఆయనకే చెల్లుబాటు.
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాల్లో తన గళాన్ని ఢిల్లీ వరకు వినిపించిన నాయకుడు కామ్రేడ్ గుండా మల్లేష్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమయంలో సమస్యల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం ఎక్కువగా తన గళాన్ని వినిపించినా నాయకుడు.తెలంగాణ సాధించు కొనడంలో గుండా మల్లేష్ పాత్ర కీలకమైనదని ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయం .అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒక్క రూపాయి తెలంగాణకు నిధులు ఇవ్వనని అన్నప్పుడు నిధులు మీ జాగీరా అని నిండు సభలో ముఖ్యమంత్రిని నిలదీసి తెలంగాణ పై ఆయనకున్న ప్రేమను చూపెట్టిన వైనం
నీతి నిజాయితీ ,ధర్మం ఆయన ఆయుధాలు, అలాంటి గుండా మల్లేష్ ని ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బెల్లంపల్లి ప్రజలు ఆశీర్వదించి పంపిస్తే బెల్లంపల్లిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ముఖ్యంగా బస్ డిపో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు తన పోరాటం చేస్తానని, బెల్లంపల్లి ప్రజలను తన గుండెల్లో పెట్టుకుంటానని తన అభిప్రాయాన్ని తెలియజేశారు .