పంజాబ్ నేషనల్ బ్యాంకు మరో బాంబు పేల్చింది.
వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ అనధికార మోసపూరిత లావాదేవీల వ్యవహారం మరొకటి వెలుగులోకి వచ్చినట్టు పేర్కొంది. ఇప్పటి వరకూ వెలుగుచూసిన నీరవ్ మోదీ మోసపూరిత లావాదేవీలకు అదనంగా రూ.1,332 కోట్ల మేరకు అనధికార లావాదేవీలు గుర్తించినట్టు వెల్లడించింది. దీంతో నీరవ్ మోదీ మోసపూరిత లావాదేవీల మొత్తం రూ.12,622 కోట్లకు చేరింది. కొత్తగా వెలుగుచూసిన అదనపు లావాదేవీల వ్యవహారాన్ని సోమవారం రాత్రి స్టాక్ ఎక్స్చేంజ్‌కు పీఎన్‌బీ తెలియజేసింది.