విహార యాత్రలు ( పిక్ నిక్ లు) విద్యార్థుల్లో జ్ఞానాన్ని, మనోవికాశాన్ని పెంపొందిస్తాయని జ్యోతి విద్యాలయ హై స్కూల్ ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి అన్నారు. గురువారం రోజు 1 నుండి 5 తరగతి పిల్లలను, శుక్రవారం రోజు 6 నుండి 10 వ తరగతి విద్యార్థులను విహార యాత్ర కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎప్పుడు తరగతి గదుల్లో బంధించి, బట్టి చదువులు కాకుండా అప్పుడప్పుడు క్రీడలకు, సిన్స్, డ్రాయింగ్, పోటీలతో పాటు ఇలాంటి విహార యాత్రలకు తీసుకెళ్లడం వల్ల విద్యార్థులకు, ఉపాద్యాయురాళ్లకు, సిబ్బందికి కాస్త ఆటవిడుపు లభిస్తుందన్నారు. మరింత రెట్టించిన ఉత్సాహంతో చదువుల్లో చురుకు ధనం పెరుగుతుందని, దీన్ని అందరూ ఎంతో వినియోగించుకొని సంతోషంగా గడిపారని ఆమే పేర్కొన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, సిబ్బంది కూడా ఎంతో సహకరించారనీ, అందుకు అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు, ముందు ముందు మరిన్ని కొత్త ప్రాంతాలకు తీసుకెళ్లి పిల్లలను చైతన్య వంతం చేస్తామని తెలిపారు.
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి హైదరాబాద్:దేశ రాజ్యాంగ నిర్మాత, వంచిత వర్గాల విమోచకుడు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, అంబేద్కర్...
Read more