కాప్రా : ఈరోజు ఉప్పల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డికి కాప్రా డివిజన్ వంపు గూడా శ్రీ లక్ష్మీ నగర్ కాలనీ ప్రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్ట్రీట్ లైట్స్, తాగునీటి పైప్ లైన్, సమస్యల గురించి వినతిపత్రం అందజేశారు. అందుకుగాను ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ పోతుల బాబు యాదవ్, ప్రవీణ్ కుమార్, కిరణ్, శ్రీనివాస్, రాజు, కర్ణాకర్ గౌడ్, వెంకటేశ్వర్లు, రాజ మల్లయ్య ,శ్రీనివాసు, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
అడిగిన సమాచారం సత్వరమే అందజేయండి-రాష్ట్ర బీసీ కమిషన్
• వివిధ ప్రభుత్వ శాఖాధిపతులతో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్.• అధ్యయనంలో నిర్దిష్ట నివేదిక సమర్పణకు కసరత్తును వేగవంతం చేసిన బీసీ కమిషన్.• విద్యా, ఉద్యోగ,...
Read more