- ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో ఆశ కలిగించి, నమ్మించి మోసాలు చేసేవారి పై ఈ నెలలోనే 03 కేసులు నమోదు ..నలుగురు అరెస్టు .
- నిరుద్యోగులు దళారుల మాటలు నమ్మి పోసవద్దు
కర్నూలు: గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అమాయకుల వద్ద డబ్బులు వసూలు చేసి మోసం చేసినటువంటి నాలుగురు కేటుగాళ్లను కర్నూల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వేలితే…
ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలు చేస్తున్నారని పలువురు బాధితులు కర్నూల్ జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ గారి దృష్టికి తీసుకువచ్చారు. దళారుల మాటలు నమ్మిమోసపోవద్దని, డబ్బులు ఇచ్చి నష్టపోవద్దని ఈసంధర్బంగా జిల్లా ప్రజలకు నిరుద్యోగ యువతకు జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు. గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అమాయకుల వద్ద డబ్బులు వసూలు చేసి మోసం చేసినటువంటి సంఘటనల పై కేసులు నమోదు అయినాయి .
1) ఓర్వకల్లు క్రైమ్ నెంబర్ ..247/2021 U/sec 420,468,471 r/w 34 IPC గా 18.08.2021 న కర్నూలు టౌన్ చెందిన వ్యక్తులపై 1)మహమ్మద్ అబ్దుస్ సలాం, ఓల్డ్ టౌన్, 2)షేక్ సలీం భాష , శిల్పటౌన్ షిప్ , కర్నూలు… అరెస్టు చేశారు. పోలీసు శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఒక్కొక్కరి దగ్గర రూ. 7 లక్షలు వసూలు చేశారు. సాక్ష్యాధారాలను సేకరించి వీరి ఇద్దరిని ఈరోజు అరెస్టు చేయడమైనది. ఇతను వద్ద నుండి తప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ సృష్టించడంకోసం ఉపయోగించిన Laptap, Forgery చేసిన డాక్యుమెంట్స్, రూ.1,42,000/- డబ్బు, భాదితుల ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఖాళీ Non-Judicial Stamp పేపర్స్ స్వాదీనము చేసుకోవడం అయినది.
2) ఆలూరు క్రైమ్ నెంబర్…178/2021 U/S 420,468,471 r/w 34 IPC గా 14.08.2021 న ఫిర్యాదు చేశారు. పవన్ కిశోర్, సులక్షాణ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వేలో టికెట్ కలెక్టర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఫోర్జరి డాక్యుమెంట్ లు సృష్టించి 18 లక్షల 30వేలు వసూలు చేశారు. సాక్ష్యాధారాలను సేకరించి 15.08.2021 న ఇద్దరిని అరెస్టు చేశారు. ప్రశాంత రెడ్డి పరారీలో ఉన్నాడు. దర్యాప్తు కొనసాగుతుంది.
3) 16.08.2021 చంద్రమోహన్ రెడ్డి చెన్నంపల్లె గ్రామం, అవుకు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రైల్వే డిపార్టుమెంట్ లో వర్క్ షాపులు ఇప్పిస్తామని 10 లక్షలు వసూలు చేశారు. నకిలీ అపాయింట్ మెంట్ ఆర్డరు కాపీ ఇచ్చి మోసం చేసాడు. కర్ణాటక రాష్ట్రం, కంపిలి టౌన్ చెందిన మంజునాథ్ ఆచూకీ కొరకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు, దర్యాప్తు కొనసాగుతుంది.
ఏ గవర్నమెంట్ ఉద్యోగం కూడా మధ్యవర్తుల ద్వారా రాదు. ప్రలోభాలకు గురి కావద్దు. ప్రభుత్వం నిర్వహించిన పోటీ పరీక్షలలోని ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయి. అమాయకులనే లక్ష్యంగా ఎంచుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే వారిపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసే వారి గురించిన సమాచారాన్ని స్ధానిక పోలీసు స్టేషన్లో ముందుస్తుగా ఫిర్యాదు చేసి తెలియజేయాలన్నారు. మోసాలకు పాల్పడే వారి గురించిన సమాచారం తెలియజేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. లంచం ఇవ్వడం తీసుకోవడం నేరమే అందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.