పిర్జాధిగుడ: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, పిర్జాధిగుడ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ కార్పొరేటర్ బొడెగే స్వాతి కృష్ణ గౌడ్ మరియు శ్రీ చైతన్య స్కూల్ రమేష్, ఆధ్వర్యంలో 3వ విడత పట్టణ ప్రగతి లో భాగంగా, రామ్ నాగర్ కాలనీ లో మొక్కలు నాటాటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న హరితహారం కార్యక్రమంలో శ్రీ చైతన్య స్కూల్ భాగస్వామ్యం కావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది, పచ్చదనం పరిశుభ్రత గురించి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేస్తున్నామని వాటిని రక్షించే బాధ్యత ప్రతి ఒకరిది అన్నారు, ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని తమ వార్డు అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, మేయర్ జక్క వెంకెట్రెడ్డి ,డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ కార్పొరేటర్లు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.