మునుగోడు లో బీసీ అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సోమవారం అసెంబ్లీలో శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి అందజేశారు. స్పీకర్ ఫార్మాట్లో ఇచ్చిన తన రాజీనామాను పోచారం ఆమోదించినట్టు రాజగోపాల్ రెడ్డి మీడియాకు తెలిపారు. మునుగోడు అభివృద్ధి కోసం రాజీనామా చేసినట్టు వెల్లడించారు.ఎమ్మెల్యేగా ఉన్న తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించారని.. అందుకే పదవీ త్యాగం చేశానని వెల్లడించారు. తాను ఇప్పుడు యుద్ధం చేస్తున్నానని తన గెలుపోటములను మునుగోడు ప్రజలే నిర్ణయిస్తారన్నారు.
మునుగోడు పరిణామాలను నిశితంగా గమనిస్తూ వస్తున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి టీఆర్ఎస్ పార్టీకి కీలక సూచన చేశారు. మునుగోడు నియోజకవర్గంలో బీసీ నాయకుడిని నిలబెట్టాలని టీఆర్ఎస్ కీలక నేత, మంత్రి కేటీఆర్ ను సోషల్ మీడియా వేదికగా కోరారు. బీసీలు అధికంగా ఉన్న మునుగోడును పాలించే హక్కు బీసీలకే ఉందని దుండ్ర కుమారస్వామి అన్నారు. కాంగ్రెస్ ను వీడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీ తరపున బరిలోకి దిగనున్నారు.. అయితే మిగిలిన పార్టీలు ఎమ్మెల్యే అభ్యర్థులుగా బీసీ నేతలను నిలబెట్టాలని దుండ్ర కుమారస్వామి కోరారు. బీసీ అభ్యర్థులను గెలిపించుకుందాం.. చట్ట సభల్లోకి పంపించుకుందామని దుండ్ర కుమారస్వామి ప్రజలకు పిలుపును ఇచ్చారు. మునుగోడు నియోజకవర్గంలో లక్ష 50వేలకు పైగా బీసీ ఓటర్లు ఉన్నారని.. బీసీ నేతను నిలబెడితే ప్రజలంతా ఆ బీసీ నేతకే ఓటు వేయాలని సూచించారు దుండ్ర కుమారస్వామి. కాంగ్రెస్, టీఆర్ఎస్ లు బీసీ అభ్యర్థికే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని సూచించారు దుండ్ర కుమారస్వామి. బీసీ అభ్యర్థిని గెలిపించి చట్ట సభల్లోకి పంపితేనే బీసీలకు మంచి జరుగుతుందని దుండ్ర కుమారస్వామి అన్నారు. ఇప్పటి దాకా మునుగోడులో ఓసీ నేతలను గెలిపించుకుంది చాలని.. ఇకనైనా బీసీ నేతకు పట్టం కట్టాలని దుండ్ర కుమారస్వామి ప్రజలను కోరారు.
1967 నుండి మునుగోడులో ఓసీకి చెందిన అభ్యర్థులే విజయాన్ని సాధిస్తూ వస్తున్నారు. బహుజనుల ఓట్లు లక్షల్లో ఉండగా.. వేలల్లో ఓట్లు ఉన్న కులాలకు చెందిన వారినే మునుగోడు ప్రజలు గెలిపిస్తూ వస్తున్నారని దుండ్ర కుమారస్వామి అన్నారు. 1967, 1972, 1978, 1983 సంవత్సరాలలో ఓసీ అభ్యర్థి పాల్వాయి గోవర్ధన్ రెడ్డిని మునుగోడు ప్రజలు గెలిపించారు. ఆ తర్వాత 1985, 1989, 1994 లలో ఓసీకే చెందిన ఉజ్జయిని నారాయణ రావును గెలిపించారు. ఆ తర్వాతి 1999 ఎన్నికల్లో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మరోసారి విజయాన్ని అందుకున్నారు. 2004 లో పల్లా వెంకట రెడ్డి, 2009లో యాదగిరి రావు, 2014లో ప్రభాకర్ రెడ్డి గెలుపొందగా.. 2018లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయాన్ని అందుకున్నారు. ఇలా అప్పటి నుండి ఇప్పటి దాకా ఓసీలే మునుగోడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు కానీ బీసీలకు ఆ అవకాశం రాలేదని దుండ్ర కుమారస్వామి చెప్పుకొచ్చారు. త్వరలో జరగబోయే ఉప ఎన్నికలో బీసీకి చెందిన వారికి టికెట్ కేటాయిస్తే తప్పకుండా ప్రజలు గెలిపించుకుంటారని కాంగ్రెస్, బీజేపీలకు దుండ్ర కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. బీసీలను అధికారానికి దూరంగా ఉంచకుండా.. వారి చేతుల్లోకే అధికారాన్ని ఇవ్వాలని దుండ్ర కుమారస్వామి పార్టీలను కోరారు. బీసీ అభ్యర్థులను నిలబెడితే ప్రజలు తప్పకుండా వారిని గెలిపిస్తారని దుండ్ర కుమారస్వామి హామీ ఇచ్చారు. బీసీ కులానికి చెందిన అభ్యర్థిని ప్రజలు గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారని దుండ్ర కుమారస్వామి ఘంటాపథంగా చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు బిసి మహిళా సంఘం అధ్యక్షురాలు గంగాపురం పద్మ మరియు దివ్య మరియు బిసి నాయకులు పాల్గొన్నారు