బీసీల బందుకు సహకరించని పార్టీలకు గుణపాఠం తప్పదు — దుండ్ర కుమారస్వామి
రాజ్యాంగ సవరణ దాకా బీసీల పోరాటం ఆగదు
బీసీల బంధువులుగా భావించే రాజకీయ పార్టీలు బీసీల న్యాయబద్ధమైన హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమానికి సహకరించకపోతే, వాటికి గుణపాఠం తప్పదని బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి హెచ్చరించారు.
ఈనెల 18న జరగనున్న బీసీల రాష్ట్ర బంద్‌కు ఇప్పటికే పలు సంఘాలు, కుల సంఘాలు, విపక్ష పార్టీలు బీజేపీతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మద్దతు లభించిందని తెలిపారు. శుక్రవారం సచివాలయం మీడియా పాయింట్ వద్ద కుల సంఘాల నేతలతో కలిసి మాట్లాడిన దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ —
“బంద్‌లో పాల్గొనని ప్రజాప్రతినిధులు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకులు, బీసీ శత్రువులుగా భావించబడతారు” అని హెచ్చరించారు.“ఈ రాష్ట్రంలోని 2.5 కోట్ల బీసీల ఆత్మగౌరవ పోరాటం ఇది. ప్రతి బీసీ నేత, బీసీ సంఘానికి చెందిన ప్రజలు ప్లకార్డులతో, నిరసనలతో బంద్‌లో పాల్గొనాలి” అని పిలుపునిచ్చారు.
“ఈ ఉద్యమం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వాన్ని రాజ్యాంగ సవరణ చేయించేందుకు, బీసీ రిజర్వేషన్లు తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చేలా ఒత్తిడి తీసుకురావడం లక్ష్యంగా కొనసాగుతుంది” అని దుండ్ర కుమారస్వామి స్పష్టం చేశారు.