ఈ రోజు శంషాబాద్ ముచ్చింతల్ చిన్న జీయర్ స్వామి వారి ఆశ్రమంలో తీర్థగోస్టి సందర్బంగా జీయర్ స్వామి వారి అనుగ్రహ ఆశీర్వచనములతో విప్ర ఫౌండేషన్ ఛైర్మన్ వల్లూరి పవన్ కుమార్ ఆద్వర్యంలో విప్ర ఫౌండేషన్.కామ్ “వెబ్ సైట్” మరియు లోగో ను ఆవిష్కరించడం జరిగింది.
ఈ సంధార్బంగా స్వామి వారు మాట్లాడుతూ సమాజ సేవలో భాగంగా ఫౌండేషన్ ను స్థాపించి వివిద సేవా కార్యక్రమాలు చేస్తూ అద్యాత్మిక, దార్మిక, సంప్రదాయ విషయాలను విస్తృత పరచడం కోసం “విప్ర ఫౌండేషన్.కామ్” ప్రచార మాద్యమం ద్వారా ప్రపంచానికి తెలియపరచడం జరుగుతుండని దీనికి స్వామి వారి ఆశీర్వచనములు ఉంటాయని, అదేవిదంగా విప్ర భవన నిర్మాణానికి సంబందించిన విషమం తెలుసుకొని భవనానికి స్వంతంగా భూమిని సమకూర్చుకోవడం గొప్ప విషయమని నిర్మాణం త్వరితగతిన పూర్తయి బ్రాహ్మణులందరికీ ఉపయోగంలోకి రావాలని సూచించారు. హిందూ మతం పరమ పవిత్రమైందని ఈ ప్రపంచంలో గోవు, బ్రాహ్మణుడు ఈ హైందవ సాంప్రదాయనికీ మూలమని వాటినితో పాటు అన్ని వర్గాల సమాజ సేవా కార్యక్రమాలలో ఫౌండేషన్ ముందుండాలని కోరారు. వెబ్సైట్ రూపకల్పనలో యారిడి నిఖిల్ అవిరల కృషి ని కొనియాడారు.
విప్ర ఫౌండేషన్ ఛైర్మన్ వల్లూరి పవన్ కుమార్ మాట్లాడుతూ జీయర్ స్వామి వారి ఆశీర్వచనములతో వారి చేతుల మేదుగా ఈ వెబ్ సైట్ మరియు లోగో ప్రారంభం చేయడం పూర్వజన్మ సుకృతమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఋగ్వేద పండితులు వోలేటి వంశీ కృష్ణ గారు, సంస్థ ప్రతినిదులు విన్నకోట రాజ్ కుమార్, మోత్కూరి సాయి శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
మీ విదేయులు
వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)
http://www.vipraafoundation.com/
సెల్ : 9246812727
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న అడిషనల్ డీసీపీ జయరాం
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న ఏసీపి జయరాం శేర్లింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ లో భారీ వినాయకుడిని మాదాపూర్ అడిషనల్ డీసీపీ జయరాం దర్శించుకున్నారు .అనంతరం ఆయన...
Read more