కుల గణన, సామాజిక న్యాయం దిశగా ఒక మైలురాయి-జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
సీఎం రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కి పాలాభిషేకం
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం రోజున తేదీ : 16-02-2024 అసెంబ్లీలో కుల గణన తీర్మానం – చారిత్రాత్మక నిర్ణయం అభినందనీయం -జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి అన్నారు. తెలంగాణా రాష్ట్రంలో సమగ్ర కుల గణన నిర్వహించే బిల్లును ఆమోదించినందుకు మరియు ఈ ప్రక్రియ కోసం భారీ నిధులను కేటాయించినందుకు తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మరియు ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బషీర్బాగ్ లో రేవంత్ రెడ్డికి పొన్నం ప్రభాకర్ కి పాలాభిషేకం చేశారు. జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ప్రసంగిస్తూ గత ప్రభుత్వాలు ఈ కీలకమైన డిమాండ్‌ను పట్టించుకోలేదని ఆరోపించారు.ఈ సమగ్ర కుల గణన డేటా వెనుకబడిన తరగతుల అభివృద్ధికి లక్ష్యీకృత సంక్షేమ పథకాలు మరియు రిజర్వేషన్ల విధానాల పెంపొందించడానికి సహాయకారిగా ఉంటుందని పేర్కొంటూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన హర్షించారు.
ఈ కుల గణన తెలంగాణాలో వివిధ వెనుకబడిన సామాజిక మరియు ఆర్థిక, విద్యా, ఉద్యోగ స్థితిగతుల పై ఖచ్చితమైన డేటాను అందిస్తుంది. ఈ సమాచారం ప్రభావవంతమైన విధానాలు మరియు కార్యక్రమాలను రూపొందించడానికి దోహద పడుతుంది అని దుండ్ర కుమార స్వామి తెలిపారు. వెనుకబడిన తరగతుల సంక్షేమం పట్ల , ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలకు కార్యక్రమాలకు,జాతీయ బిసి దళ్ దుండ్ర కుమార స్వామి పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. కుల గణన సజావుగా మరియు సమర్థవంతంగా జరిగేలా ఖచ్చితమైన డేటా సేకరణకు స్వచ్ఛంద సహాయాన్ని అందిస్తారని దుండ్ర కుమార స్వామి తెలిపారు..
తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం రాష్ట్రంలోని లక్షలాది వెనుకబడిన తరగతి వ్యక్తుల జీవితాలపై గణనీయమైన ప్రభావం చూపిస్తుంది. సామాజిక న్యాయం మరియు వెనుకబడిన తరగతుల సమ్మిళిత అభివృద్ధి సాధన కోసం తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని, దానికి నిలువెత్తు నిదర్శనం కుల గణన నిర్ణయం అని తెలిపారు .
తెలంగాణాలో సామాజిక న్యాయం మరియు సమ్మిళిత అభివృద్ధికి ఒక కొత్త శకానికి నాంది పలుకుతుందని అని దుండ్ర కుమార స్వామి తెలిపారు.నేషనల్ ఓబీసీ ప్రొటెక్షన్ ఫోరం ఆళ్ల రామకృష్ణ ,తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి మరియు పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వి వెంకటరమణ, రాజేష్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ అజయ్ సాయి, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
