తెలంగాణ భవన్: తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ సమక్షంలో హుజూరాబాద్ నేత, టీపీసీసీ మాజీ కార్యదర్శి పాడి కౌశిక్ రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ…. ప్రభుత్వ పథకాలపై విమర్శలను తిప్పికొట్టారు. తెలంగాణ పునర్నిర్మాణం ఒక ట్రాక్ ఎక్కిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. అయితే ఈ క్రమంలో విమర్శలకు భయపడి తమ ప్రస్థానాన్ని ఆపమని సీఎం స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ మరియు తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.