కాంగ్రెస్ పార్టీకే పార్లమెంట్ ఎన్నికలలో మా మద్దతు- కుల సంఘాలు బీసీ సంఘాలు
*జాతీయ బిసి దళ్, *కుల సంఘాల అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం*
సామాజిక న్యాయం కాంగ్రెస్ తో సాధ్యం అని అ జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి (Dundra kumaraswamy)అన్నారు. జనాభా దామాషా ప్రకారం ప్రజలు హక్కులు పొందడం ప్రజాస్వామిక సామాజిక న్యాయం ,అది కులగణన తో సాధ్యం అని అన్నారు. సోమవారం నాడు జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో కుల సంఘాల అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. . ఈ ఆఖిలపక్ష సమావేశంలో రాష్ట్రంలోని అన్ని బీసీ కుల సంఘాలు,కుల సంఘాల అధ్యక్షులు, విద్యార్థి నాయకులు న్యాయవాదులు, మేధావులు పాల్గొన్నారు. బీసీలకు మంచి చేయాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటూ ఉండడం నిజంగా అభినందనీయమని కుల సంఘాలు అభిప్రాయపడ్డాయి. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం, వైపు ఆలోచన చేస్తుందని తెలిపారు. కులగణన నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమైనది.. కులగణన జరిగితే బడుగు బలహీన వర్గాలకు జనాభా దామాషా ప్రకారం సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు అందుతాయని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి(National BC Dal president Dundra kumaraswamy) తెలిపారు. అందుకు కారణమైన కాంగ్రెస్ పార్టీకే మా మద్దతు అని కుల సంఘాలు ప్రకటించాయి. బీసీలకు ఏమేమి చేస్తే మంచి జరుగుతుందో కూడా కుల సంఘాలు నిర్ణయించాయి.. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళ్లడానికి కుల సంఘాలు సిద్ధమయ్యాయి.
జనాభా దామాషా ప్రకారం రాజ్యాధికారం దక్కేవరకు పోరాడాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి పిలుపిచ్చారు. సమాజంలో బీసీలకు ఆత్మ గౌరవం దక్కాలంటే రాజకీయ అధికారమే పరిష్కారమని తెలిపారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ బీసీలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. బిజెపికి బీసీల ఓట్లు కావాలి, కానీ బీసీ సంక్షేమ అవసరం లేదు అని అన్నారు.
. బీసీ ప్రతినిధులతో త్వరలోనే భారీ సమావేశం కూడా నిర్వహించనున్నట్లు దుండ్ర కుమారస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ దళ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేంద్ర బాబు, న్యాయవాది వడ్డేమని శ్రీనివాస్, ప్రొఫెసర్ కేశవ్, సాయి యాదవ్, కుల సంఘ నేతలు పాల్గొన్నారు.