మన అభ్యర్థులు – మన ఓట్లు,బిసి ఓటు బిసిలకు బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో వివిధ పార్టీల నుండి మరియు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న బీసీ అభ్యర్థులకు బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి శుభాకాంక్షలు తెలిపారు. బీసీలు రాజకీయంగా ఎదగడానికి జిహెచ్ఎంసి ఎన్నికలు ఎంతో దోహదపడతాయని ఈ సందర్భంగా తెలిపారు. అలాగే అభ్యర్థులకు టికెట్లు ఇచ్చిన టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, బిజెపి పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారికి,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ ఉత్తం కుమార్ రెడ్డి గారికి ,టిడిపి అధ్యక్షులు ఎల్ .రమణ గారికి అలాగే వివిధ పార్టీల అధ్యక్షులకు ధన్యవాదాలు తెలిపారు.బీసీలు మన అభ్యర్థులు మన ఓట్లు, అనే నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మన ఓట్లు మనం వేసుకుంటే మనం తప్పకుండా రాజ్యాధికార దిశగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలిపారు.. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు ఏకమైతే రాజ్యాధికారం వెతుక్కుంటూ మన దగ్గర వస్తుందని చెప్పారు. బీసీలు కేవలం ఓటు బ్యాంకులు కాకుండా రాజకీయంగా ఎదగాలని ఎందుకు అన్ని బీసీ సంఘాల నాయకులు, బీసీలు సమగ్రంగా తమ వంతు సహకారం అందించి బీసీ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు తెలిపి వారి నియోజకవర్గంలో బరిలో ఉన్న బీసీ అభ్యర్థులకు బీసీలు కచ్చితంగా ఓటు వేసే విధంగా ప్రచారం చేయాలని, అలాగే మద్దతు ప్రకటించాలని కుమారస్వామి ఈ సందర్భంగా కోరారు. బిసి ల అభివృద్ది కి తమ సంస్థ నుండి ఎల్లపుడూ ఉంటుందని అలాగే ప్రతి ఒక్కరూ తమ వోటు హక్కు వినియోగించుకోవాలని , ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా బిసి వాదాన్ని, బిసి నాయకులను గెలిపించి బిసి ల అభివుద్ది కి దోహద పాడాలని ఈ సంధర్భంగా బీసీ దళ్ మేడ్చల్ జిల్లా యూత్ ప్రెసిడెంట్ గోపి మరియు ఇతర యువ నాయకులు పాల్గొన్నారు.
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు….
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు…. సెవెన్ సీస్ గేమ్ డెవలప్మెంట్ కంపెనీ అధినేత మారుతి శంకర్ కుమారుడు పంచ కట్టు...
Read more