ఒప్పో ఎఫ్5 స్మార్ట్‌ఫోన్ సిద్ధార్థ్ లిమిటెడ్ ఎడిషన్
ఒప్పో తన ఎఫ్5 స్మార్ట్‌ఫోన్‌ను గతేడాది నవంబర్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఫోన్‌కు గాను సిద్ధార్థ్ లిమిటెడ్ ఎడిషన్ వేరియెంట్‌ను ఒప్పో తాజాగా విడుదల చేసింది. ఒప్పో తన కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయిన సిద్ధార్థ్ మల్హోత్రా పేరిట ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది. రూ.19,990 ధరకు ఈ ఫోన్ యూజర్లకు ప్రత్యేకంగా అమెజాన్ సైట్‌లో లభిస్తున్నది. ఈ నెల 8వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. అనంతరం 9వ తేదీ నుంచి ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ ఈ ఫోన్ లభ్యం కానుంది. ఇక ఫీచర్లన్నీ గతంలో వచ్చిన ఎఫ్5 ఫోన్‌లో మాదిరిగానే ఉన్నాయి.
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే,
2160 × 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 2.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ.