ఉప్పల్ : ఈ రోజు ఉప్పల్ పోలి స్టేషన్ పరిధిలో రామంతపూర్ ప్రాంతంలో “ఆపరేషన్ చాబుత్రా” పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించి, లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ, ఏ కారణం లేకుండా రోడ్లమీదకు వచ్చిన 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని, అత్యవసరం అయితే తప్ప అనవసరంగా బయటకు రావద్దని కౌన్సెలింగ్ ఇచ్చారు.