నవంబర్ 2021 లో బోట్స్వానా లో మొదటగా ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించారు. ఇది అతి తక్కువ కాలంలో అత్యధిక దేశాలకి వ్యాపించింది. చాలా దేశాల్లో మరొక కరోనా వేవ్ ని తీసుకుని తీసుకొచ్చింది. అయితే దీని తీవ్రతరం అంతకుముందు వేరియంట్స్ పోలిస్తే తక్కువ గా ఉంది. హాస్పిటల్ లో చేరికలు కూడా చాలా తక్కువ గా ఉన్నాయి అని నిపుణులు చెప్తున్నారు.
దీనికి గల కారణాలను అన్వేషిస్తూ అమెరికా శాస్త్రవేత్తలు ఈమధ్య లోతుగా పరిశోధనలు చేశారు.ఈ పరిశోధనా ఫలితాలను న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించారు. వైరస్ ప్రభావం కంటే ప్రజల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని నిర్ధారణకు వచ్చారు. ఇంతకు ముందే వేసుకున్న వ్యాక్సిన్ డోసులు ఈ రోగ నిరోధక శక్తి పెరగడానికి ప్రధాన కారణమై ఉండొచ్చని పేర్కొంటున్నారు. దీనికి ఉదాహరణగా దక్షిణాఫ్రికా ప్రజలని చెప్పారు.వారిలో 2021 చివరికల్లా చాలామంది వాక్సీన్ పూర్తి చేసుకోవడమో లేక వారికి అంతకుముందే కరోనా సోకి తగ్గి ఉండడం జరిగిందని పేర్కొన్నారు.
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి హైదరాబాద్:దేశ రాజ్యాంగ నిర్మాత, వంచిత వర్గాల విమోచకుడు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, అంబేద్కర్...
Read more