శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ లో గుంతల మయమైన రోడ్లు పట్టించు కొని అధికారులు,ప్రజాప్రతినిధులు-
శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ లో ఉన్న నేషనల్ హైవే భవాని హార్డ్వేర్ షాప్ నుండి భిక్షపతి ఎనక్లేవ్ వరకు ఉన్న ప్రధాన రహదారి గుంతలమయమై, బురద నీటితో ఉందని ఆరోపిస్తున్నారు.ఈ దారి లో
స్కూల్ పిల్లలకు,కాలనీ వాసులు,బస్తి వాసులకు,అపార్ట్మెంట్ వాసులకు నడవలేని స్థితిలో తీవ్ర ఇబ్బందిలు పడుతున్న అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని అటు వైపు చూసిన పరిస్థితి లేదు అని తెలియజేశారు.కాంట్రాక్టర్లు పైప్ లైన్ వేసి కనీసం గుంతలు కూడా పూడ్చకుండా వదిలివేసి వెళ్లడం తో రోడ్ వేసే GHMC ,పైప్ లైన్ వేసిన వాటర్ వర్కస్ వారికి సమన్వయం లేకపోవడం,కనీసం ప్రజా ప్రతినిధుల పట్టించుకోకపోవడం లేదు. గత 2 -3 నెలలుగా స్కూల్ పిల్లలు,ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.త్వరలో రోడ్డు వేసి ప్రజా ఇబ్బందులను తీర్చాలని లేని ఎడల ప్రజలతో కలిసి రోడ్డు పై ధర్నా చేస్తాం అని బీజేపీ పార్టీ హెచ్చరిస్తోంది.