హైదరాబాద్ విశ్వవిద్యాలయం మెయిన్ గేట్ దగ్గర సామాజిక న్యాయం కోసం ఓబిసిల సత్యాగ్రహ ఆమర నిరాహారదీక్ష జి.కిరణ్ కుమార్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా ఓబీసి స్టూడెంట్స్ అసోసియేషన్, జాజుల నరేశ్ యాదవ్ జాతీయ కో ఆర్డినేటర్
వై.శివ కుమార్, తెలంగాణ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా ఓబీసి స్టూడెంట్స్ అసోసియేషన్
ఆధ్వర్యములోతేది: 24 డిసెంబర్ 2020 నుండి జరుగుతుంది.
వైస్ చాన్సలర్, ప్రొఫెసర్ పి. అప్పారావుగారు రిజర్వేషన్ల విధానాలను ఉల్లంఘిస్తూ, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, బీసీ విద్యార్థులను , బోధనేతర సిబ్బంది మరియు బోధనా అధ్యాపకులను మోసం చేస్తున్నారు.
ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్స్ లో భాగంగా నిరాహార దీక్ష జరుగుతుంది. అక్కడికి తెలంగాణ బీసీ దల్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీసీ దల్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి మాట్లాడుతూ గేటు లోపల చదువుకునే విద్యార్థులు గేటు బయట కూర్చొని దీక్ష చేయడం ఓ బి సి రిజర్వేషన్లు మరియు హక్కులు కాలరాస్తున్నారని చాలా విచారణ తెలియజేశాడు. ఓ బి సి విద్యార్థుల రిజర్వేషన్లు వారి హక్కులను కాల రాయాలని ప్రయత్నిస్తే ఎంతటివారైనా కాలగర్భంలో కలుస్తారని,విద్యార్థుల శక్తిని ఆపగలరు కానీ వారి ఆదర్శాలను ఆలోచనలు ఎవరు ఆపలేరు అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓబిసి రిజర్వేషన్లు మరియు వారి హక్కులను పరిరక్షించే విధంగా పని చేయాలి కానీ అలా లేకపోవడం కొంత బాధాకరం అని తెలియజేశాడు.వెంటనే వైస్ఛాన్సలర్ అప్పారావు గారికి ప్రత్యేకమైన విజ్ఞప్తి మరియు డిమాండ్ చేస్తూ యుజిసి మార్గదర్శకాల ప్రకారం నియామకాలు జరగాలని
ఎన్.సి.బి.సికి నివేదికలో పేర్కొన్న ప్రకారం ఓబిసి విద్యార్థులు, అధ్యాపకులు మరియు బోధనేతర సిబ్బందికి న్యాయం చేయండి. ఖాళీగా ఉన్న పి.హెచ్.డి మరియు ఎం.ఫిల్ లను భర్తీ చేయాలి.ప్రత్యేక ప్రవేశ డ్రైవ్ నిర్వహించి, జూన్ 2020 నోటిఫికేషన్‌లో ఖాళీగా ఉన్న అన్ని పీహెచ్‌డీ స్థానాలను భర్తీ చేయాలి.మరియు అధికార పలుకుబడితో OBC విద్యార్థులను, అధ్యాపకులను మరియు బోధనేతర సిబ్బందిని మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేయడం వంటివి చేయకుండా చూడాలి, ఎన్.సి.బి.సి ఇచ్చే ఆదేశాలను కచ్చితంగా పాటించాలి.పై డిమాండ్లు వెంటనే పరిష్కరించే విధంగా పని చేయాలని లేదంటే స్వాతంత్రం సాధించడానికి ఒక ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి మరో ఉద్యమం మూడవ ఉద్యమం ఓబిసీ రిజర్వేషన్లు వారి హక్కులను సాధించుకోవడానికి జరుగుతుందని దీనికి సెంట్రల్ హైదరాబాద్ యూనివర్సిటీ గేటు వద్ద బీజం వేసినట్లు ఆవుతుందని తెలియజేశాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గేటు నుండి ఢిల్లీ గేట్ దాకా మండుతున్న బిసి ఉద్యమ సెగ ఉంటుందని తెలియజేశాడు మరియు ఓబిసి రిజర్వేషన్ లక్ష్యం సాధించే దారిలో ముళ్ళు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి ఆటుపోట్లు ఉంటాయని, ఆగం కండి,అగ కండి మిత్రమా తెలంగాణ రాష్ట్రం నుండి నాలుగు కోట్ల మంది దేశం నుండి 60 కోట్ల మంది మీ తోడునీడగా ఉంటారని తెలియజేసినాడు. ఈ కార్యక్రమంలో లో బిసి దల్ సెక్రటరీ ప్రశాంత్, కనకయ్య, లక్ష్మణ్, శరత్
బిసి దళ్ రంగారెడ్డి జిల్లా యూత్ అధ్యక్షుడు సాయి యాదవ్, మేడ్చల్ జిల్లా యూత్ అధ్యక్షుడు గోపి, మరియు ఇతరులు పాల్గొన్నారు.