అణు శక్తిదే భవిష్యత్తు
భవిష్యత్తు అంతా అణుశక్తిదేనని భారతదేశానికి చెందిన ప్రముఖ శాస్ర్తవేత్తలు అన్నారు. ప్రపంచ ఇంధన అవసరాలను ఇది మాత్రమే తీర్చగలదని అభిప్రాయపడ్డారు. అయితే అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటు పై ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ బాధ్యతను ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియా తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ లోని బేగం పేట్ లో గల ఏఎండీ ఆడిటోరియంలో డిపార్ట్ మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులు శుక్రవారానికి మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సదస్సులో ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్. ధీరజ్ జైన్ మాట్లాడుతూ అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే రేడియేషన్ వల్ల తీవ్ర ప్రభావం పడుతుందని ప్రజల్లో భయం నెలకొని ఉందన్నారు. అయితే సాంకేతికతను ఉపయోగించి, ఎలాంటి ప్రభావం లేకుండా చేయవచ్చన్నారు. అణు విద్యుత్ తయారీలో యురేనియం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అణువిద్యుత్ పై జరుగుతున్న ప్రయోగాల్లో భాగంగానే ఇప్పటికే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తయారు చేశామన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా అణు పరిశోధనల్లో మరింత ముందుకు దూసుకు పోవాల్సిన అవసరముందన్నారు. దీనికి మీడియా రంగం సహకారం ఎంతో అవసరముందన్నారు. ఏఎండీ డైరెక్టర్ డాక్టర్ సిన్హా మాట్లాడుతూ డీఏఈ ద్వారా జర్నలిస్టులకు శిక్షణ ఇప్పించడం ద్వారా ప్రజల్లో నెలకొన్న భయాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈసీఐఎల్ సీఈఓ డాక్టర్ అడ్మిరల్ షోబే మాట్లాడుతూ విద్యుత్ ఉత్పత్తిలో అణు విద్యుత్ ఉత్పాదన అనేది ఎంతో కీలకమన్నారు. అణు పరిశోధనలు దేశానికి ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఈసీఐఎల్ ద్వారా ఎన్నో విద్యుత్ పరికరాలు, విద్యుత్ సంబంధిత యంత్రాలు తయారీ చేయడం జరుగుతుందన్నారు. డీఏఈ-బార్క్ సెంటర్ ప్రతినిధి డాక్టర్ వాత్స అణు పరిశోధనలకు సంబంధించించిన అంశాలను వివరించారు. అనంతరం పలువురు జర్నలిస్టులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ప్రముఖ సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఫిరోజ్ ఖాన్ పలు ప్రశ్నలను శాస్త్రవేత్తలను అడిగారు. అణు విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచ దేశాలు ఫాస్ట్ గా ముందుకు సాగుతుంటే, భారతదేశం వెనకబడడానికి కారణాలేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ విధానాలు సరిగా లేకపోవడమా లేదా పరిశోధనలు సరిగా జరగకపోవడమా అని అడిగారు. అయితే జర్నలిస్టుల ప్రశ్నలకు శాస్త్రవేత్తలు జవాబిచ్చారు. సందేహాలను పూర్తిస్థాయిలో నివృత్తి చేశారు. కార్యక్రమాల్లో ఈసీఐఎల్ అధికారి డాక్టర్ ఫారిక్, మహిళా ప్రతినిధురాలు శైలజ, సతీష్ అయ్యర్, సమీర్, దినేష్ లాడే, ఏఎండీ ప్రతినిధి అంజనీకుమార్ పాల్గొన్నారు.
వకుళాభరణం దారెటు?
వకుళాభరణం దారెటు డాక్టర్ వకుళాభరణం రాజకీయ భవిష్యత్తుపై చర్చోపచర్చలు డాక్టర్ వకుళాభరణం దారి బిఆర్ఎస్ లో కొనసాగుతారా?, కాంగ్రెస్ పార్టీలో చేరతారా?, బిజెపి వైపు వెళతారా? డాక్టర్...
Read more